Categories: FeaturedMovie News

Nagarjuna: మొన్న తోసేసారు.. నేడు దగ్గరికి తీసుకున్నారు.. తప్పు సరిదిద్దుకున్న నాగార్జున?

Nagarjuna: అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ముంబై ఎయిర్ పోర్ట్ లో వస్తున్న సమయంలో అక్కడే పని చేస్తున్నటువంటి ఓ అభిమాని తనని కలవడం కోసం వచ్చారు కానీ తన బాడీగార్డ్ మాత్రం తనని తోయడంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి కింద పడపోయారు.

ఇలా ఆ వ్యక్తి కింద పడుతున్న తరుణంలో అక్కడే ఉన్నటువంటి మరొక సిబ్బంది తనని పట్టుకున్నారు. అయితే నాగార్జునకు ఈ విషయం జరిగినది తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడమే కాకుండా నాగార్జున పై విమర్శలు రావడం మొదలయ్యాయి. ఇలా ఈ విషయం నాగార్జున దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించి క్షమాపణలు చెప్పారు.

ఇప్పుడు ఈ విషయం నా దృష్టికి వచ్చింది మా స్టాఫ్ అలా చేసి ఉండకూడదు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము క్షమించండి అంటూ క్షమాపణలు కోరారు. అయితే తాజాగా మరోసారి అదే ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన నాగార్జున మొన్న తనని కలవడానికి వచ్చిన అభిమానిని పిలిచి తనని దగ్గరకు తీసుకున్నారు. అయితే ఆయన హ్యాండీక్యాప్ కావడం గమనార్హం.

అభిమానిని కలిసిన నాగార్జున
ఇలా తనని దగ్గరకు పిలిపించుకొని తనతో మాట్లాడారు. ఇలా నాగార్జున తనని దగ్గరికి తీసుకోవడంతో ఆ అభిమాని కూడా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో పై పలువురు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నాగార్జున తన తప్పు తెలుసుకొని ఆ అభిమానిని కలవడానికి వెళ్ళారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago