Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా బుల్లితెరను ఓ రేంజ్ లో ఏలిన ఈమె అనంతరం సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్లారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అనసూయ పూర్తిగా బుల్లితెర కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇలా బుల్లితెరకు దూరమైన ఈమె వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న తరుణంలోనే అనుకొని విధంగా తిరిగి బుల్లితెర కార్యక్రమాలకు రీ ఎంట్రీ ఇచ్చారు.
గతంలో జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం మాత్రం స్టార్ మా లో కిరాక్ బాయ్స్ ఖిలాడీ లేడీస్ అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా, ఈ ప్రోమో మాత్రం భారీ స్థాయిలో రేటింగ్ కైవసం చేసుకుంది. ఇక ఈ ప్రోమోలో అనసూయ అందరి ముందు జాకెట్ విప్పడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
ఇక ఈ విషయంలో తన పై ట్రోల్స్ రావడంతో ఈమె ఎప్పటిలాగే తనని తాను సమర్థించుకున్నారు అయితే తాజాగా అనసూయ బుల్లితెర కార్యక్రమాల విషయంలో ఇచ్చిన మాట తప్పారని ఈమె పై నేటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించినటువంటి అనసూయ తిరిగి బుల్లితెరపైకి ఎప్పుడు వస్తారని ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు.
టీఆర్పీ స్టంట్స్..
చెత్త టీఆర్పీ స్టంట్స్ ముగిసే వరకు యాంకరింగ్ చేసేది లేదని అనసూయ అన్నారు. బుల్లితెర కార్యక్రమాలు అంటే తప్పనిసరిగా టీఆర్పీ స్టంట్స్ ఉంటాయి ఇటీవల అనసూయ జాకెట్ విప్పడం కూడా టీఆర్పీ స్టంట్ లో భాగమే అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా యాంకర్ గా బుల్లితెరను ఏలిన ఈమె ఈసారి ఈటీవీలో కాకుండా స్టార్ మాకు వచ్చారు. అయితే ఈమె ఈసారి ఈటీవీలో కాకుండా స్టార్ మా కు వచ్చారు. ఈటీవీలో తక్కువ రెమ్యూనరేషన్ ఉండటం వల్ల ఈమె స్టార్ మాను ఎంపిక చేసుకున్నారంటూ కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…