Ali: తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో అలీ ఒకరు ప్రస్తుతం ఈయన సినిమాలను చాలా వరకు తగ్గించి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేయడమే కాకుండా కొన్ని కీలకమైన సినిమాలలో మాత్రమే నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల రాజకీయాలకు కూడా కాస్త దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
ఇదిలా ఉండగా అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న బడ్డీ సినిమా ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి అలీతో పాటు పూరి జగన్నాథ్ కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పూరి గురించి ఆలీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికీ ఎంతో మంచి అనుబంధం ఉంది. పూరీ సినిమాలలో ఆలీ పాత్ర లేకపోయినా ఈయన సృష్టిస్తుంటారు .పూరి సంతోషంలో ఉంటే ఆలీ బొకే ఇస్తారు బాధలో ఉంటే ఒక పెగ్ ఇస్తారు.
ఇలా వీరి మధ్య ఉన్న అనుబంధం గురించి అలీ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ్ ఏదైనా ఒక సినిమా కథ రాయాలి అంటే ఈయన బ్యాంకాక్ వెళ్లి అక్కడ బీచ్ లో కూర్చుని సినిమా కథలు రాస్తుంటారు. ఇలా బ్యాంకాక్ లో ఈయనకు చాలా మంచి పరిచయాలు అభిమానులు కూడా ఉన్నారు.
సీఎం అవుతారు..
బ్యాంకాక్ లో ఇప్పుడు ఎన్నికలు పెడితే కనుక పూరి జగన్నాథ్ తప్పకుండా సీఎం అవుతారు. అంత ఫాలోయింగ్ ఆయనకి ఉంది. ఇక నేను ఈ ఎన్నికలలో పోటీ చేసి గెలిస్తే హోమ్ మినిస్టర్ కూడా అవుతాను అంటూ ఈ సందర్భంగా బ్యాంకాక్ లో పూరి జగన్నాథ్ క్రేజ్ గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…