Movie News

Nagarjuna: బాలయ్య అన్ స్టాపబుల్2 కి నో చెప్పిన నాగార్జున.. కారణం అదేనా?

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే నాగర్జున మీలో ఎవరి కోటీశ్వరులు బిగ్ బాస్ వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణ కూడా ప్రస్తుతం అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా పూర్తి కావడంతో రెండవ సీజన్ కూడా ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి నాగార్జున వస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాగార్జున నో చెప్పినట్లు సమాచారం.

ఇలా నాగార్జున బాలయ్య టాక్ షో కి రాకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఈ షోలో పాల్గొనడం వల్ల సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతాయన్న నేపథ్యంలోనే ఈ షోకి నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నాగార్జున ఇదే సమస్య అనుకుంటే ముందుగానే నిర్వాహకులకు చెప్పి ఇలాంటి ప్రశ్నలు అడగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

Nagarjuna: వ్యక్తిగత సమస్యలే కారణమా..

కానీ నాగార్జున మాత్రం ఈ కార్యక్రమానికి రావడానికి ఆసక్తి చూపడం లేదట. అయితే ప్రస్తుతం నాగార్జున పరిస్థితులు ఏమంత బాలేవని, అందుకే ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.మరి నాగార్జున ఈ కార్యక్రమానికి రాకపోవడానికి సరైన కారణం ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే తాజాగా నాగార్జున ది ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

2 days ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

2 days ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

2 days ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

2 days ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

2 days ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

2 days ago