Nagarjuna: బిగ్ బాస్ కార్యక్రమం వివిధ భాషలలో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇలా తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకుని ఆరవ సీజన్ ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఈ కార్యక్రమానికి ఏ విధంగా అయితే అభిమానించే వాళ్ళు ఉన్నారో విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు.ఈ క్రమంలోనే గత రెండు సీజన్ల నుంచి బిగ్ బాస్ కార్యక్రమం పై విమర్శలు అధికమయ్యాయి.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమాన్ని విమర్శించే వారిలో సీపీఐ నారాయణ ముందు వరుసలో ఉన్నారు. ఈ కార్యక్రమం పై నారాయణ స్పందిస్తూ బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఏకంగా ముంబై రెడ్ లైట్ ఏరియాతో పోల్చారు.ఇది బిగ్ బాస్ కార్యక్రమం కాదని బ్రోతల్ హౌస్ అంటూ ఈయన ఈ కార్యక్రమం పై విమర్శలు చేయడమే కాకుండా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
నాగార్జున కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని డబ్బు కోసం ఎలాంటి పనులు చేయడానికి అయినా సిద్ధపడతారంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే నారాయణ మాటలను నాగార్జున సీరియస్ గా తీసుకోవడమే కాకుండా గత శనివారం బిగ్ బాస్ వేదికపై కంటెస్టెంట్లతో సందడి చేసినటువంటి నాగార్జున హౌస్ లో ఉన్నటువంటి మెరీనా రోహిత్ దంపతులను కౌగిలించుకొమ్మని చెప్పారు.
నాగార్జున ఇలా చెప్పేసరికి కాస్త మొహమాటపడిన మెరీనా రోహిత్ ఏం పర్లేదు మీకు లైసెన్స్ ఉంది అంటూ వారికి పెళ్లయిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే నాగార్జున నారాయణ నారాయణ అంటూ మాట్లాడటంతో ఈ వార్తలు నారాయణని ఉద్దేశించే అన్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ తాను ఎవరిని ఉద్దేశించి అలా మాట్లాడలేదని తాను ఎవరైనా జోక్ చేసిన లేకపోతే ఎవరినైనా నవ్వించాలన్న నారాయణ.. నారాయణ అంటానంటూ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…