Featured

Suthi Veerabhadra Rao : ఒక్క నిర్లక్ష్యం ప్రాణాలను బలి తీసుకుంది.. షూటింగ్ కోసం ఆలస్యం చేయకపోయి ఉంటే..!

Suthi Veerabhadra Rao : ‘హైదరాబాదు.. సికింద్రాబాదు.. ముషీరాబాదు..’ అంటూ చెప్పగానే సుత్తి వీరభద్రరావు గారి డైలాగు ప్రతి తెలుగు ప్రేక్షకుడికి గుర్తొస్తుంది. ‘అట్టు.. మినపట్టు.. పెసరట్టు..’ అంటూ సాగే డైలాగులు అందరినీ నవ్విస్తాయి. ఆయన చేసింది కొన్ని సినిమాలే అయినా కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. దాదాపు 50 సినిమాలలో నటించిన వీరభద్ర రావు గారి అసలు పేరు మామిడిపల్లి వీరభద్ర రావు. ఆకాశవాణి రేడియో లో పని చేస్తూ సినిమాల్లోకి వచ్చిన వాళ్లలో వీరభద్ర రావు గారు కూడా ఒకరు.

చిన్న అలసత్వం ప్రాణాలను తీసింది…

తండ్రి చూపించిన ఉద్యోగం చేయకుండా వీరభద్ర రావు గారు అయన నచ్చిన పని చేయడం కోసం నటుడుగా అటు నాటకాలలో, ఉద్యోగరీత్య ఆకాశవాణిలో చేరారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో దాదాపు ఇరవై సంవత్సరాలు నాటక రంగంలో పనిచేసిన ఆయన 1980 లో సినిమా రంగం లోకి అడుగుపెట్టారు. మాదాల రంగారావు గారి స్నేహం వల్ల ‘బలిపీఠం’ సినిమాలో నటించారు. ఇక జంధ్యాల గారు మంచి మిత్రులు అవడం వల్ల ఆయన సినిమాల్లో నటించారు. ‘నాలుగు స్థంబలాట’ మంచి గుర్తింపు తీసుకురావడంతో వరుసగా మంత్రి గారి వియ్యంకుడు, అహ! నా పెళ్ళంటా, చూపులు కలిసిన శుభవేళ, మూడు ముళ్ళు, రెండుజెళ్ళ సీత, ఆనంద భైరవి, కాంచన గంగ, మెరుపు దాడి, శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడి బొమ్మ, స్వాతిముత్యం, చంటబ్బాయి, శాంతినివాసం వంటి దాదాపు 50 సినిమాల్లో నటించారు. ఇక జంధ్యాల గారి చూపులు కలిసిన శుభవేళ ఆయన చివరి చిత్రం.

1988 లో ‘చూపులు కలిసిన శుభవేళ’ సినిమా చిత్రీకరణ లో భాగంగా హైదరాబాద్ లో సాంగ్ షూటింగులో కాలు బెణికితే, అప్పటికే మధుమేహం ఉన్న వీరభద్ర రావు గారు వైద్యులు చికిత్స, విశ్రాంతి అవసరం అని చెబితే సినిమా షూటింగ్ పూర్తయ్యాక చెన్నై కి వెళ్లి చికిత్స పొందారు. అయితే రాత్రి నిద్రపోడానికి ఇంజక్షన్ చేయించుకోవడం వల్ల అది వికటించి ఆయన గుండె పోటు తో మరణించారు. మొదటే విశ్రాంతి తీసుకుని సరైన సమయంలో చికిత్స తీసుకుని ఉంటే ఆయన బ్రతికిఉండేవారేమో…

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago