Categories: FeaturedMovie News

బాలయ్యకు షార్ట్ టెంపరంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్జివీ హీరోయిన్ !

గతంలో ఓ సినిమా ఫంక్ష‌న్‌ లో స్త్రీల గురించి టాలీవుడ్ లెజెండ్ బాల‌కృష్ణ చేసిన వివాదస్పదమైన కామెంట్స్ అప్ప‌ట్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హిందూపురం ఎమ్మెల్యేగా, ఆంధ్రాలో అధికార పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధిగా ఆయ‌న బాధ్య‌తా ర‌హితంగా స్త్రీల‌ను కించ‌ప‌రిచే విధంగా కామెంట్స్ చేశార‌ని కొందరు రాజ‌కీయ నాయకులు మండిపడ్డారు. ఫైనల్ గా నందమూరి బాల‌కృష్ణ చేసిన కామెంట్స్‌ అసెంబ్లీలో కూడా చ‌ర్చ‌కు దారి తీశాయి.

తాజాగా మన బాలయ్య బాబుపై “నగ్నం” చిత్ర కధానాయిక స్వీటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరి ఆ కామెంట్స్ ఏమిటో మీకూ తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవాల్సిందే.! సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూపొందించిన “నగ్నం” సినిమాలో తన అందాలను ఆరబోసి యువత మనసు దోచుకున్న గ్లామర్ బ్యూటీ స్వీటీ అసలు పేరు శ్రీ రాపాక. ఈమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే కాస్ట్యూమ్ డిజైనర్‌గా టాలీవుడ్ లోని అగ్ర హీరోలతోనూ, హీరోయిన్లతోనూ పని చేసింది. తాజాగా ఈమె హీరోయిన్ గా నటించిన నగ్నం చిత్రం విడుదల కావడంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. “నగ్నం” మూవీ విడుదలైన సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఈ అమ్మడు టాలీవుడ్ లెజెండ్ బాలయ్యపై సంచలనమైన కామెంట్స్ చేసింది.

ఒకసారి ఏదో సినిమా డిస్కషన్ పని వుండి బాలయ్యగారింటికి వెళ్లానని, తాను వెళ్ళేటప్పుడు తన ఫ్రెండ్స్ కూడా బాలయ్య గారికి కోపమెక్కువని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పారని, వాళ్ళ మాటలు విన్న తర్వాత తాను నిజంగానే భయపడుతూ బాలయ్యగారి ఇంటికి వెళ్ళానని.. తీరా బాలయ్య గారి ఇంట్లోకి అడుగు పెట్టాక తనను సాదరంగా ఆహ్వానించి గౌరవించారని, బాలకృష్ణ గారిది చిన్న పిల్లల మనస్తత్వమని, బాలయ్య గారికి షార్ట్ టెంపర్ వుందని.. అయినా ఆయనకు క్షణాలలో కోపం వచ్చేసినా వెంటనే ఆ కోపం తగ్గిపోతుందని తెలియజేస్తూ.. ఇంటర్వ్యూ కి ముగింపు చెప్పే సమయంలో తనకు కూడా బాలయ్య గారిలా షార్ట్ టెంపర్ వుందని ట్విస్ట్ ఇచ్చింది దేవరపల్లి బ్యూటీ స్వీటీ.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago