టాలీవుడ్‌లో ప్రేమించి పెళ్ళి చేసుకున్న అందమైన జంటల్లో ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతల జంట ఒక్కటి. ఈ జంట యొక్క గొప్పతనం ఏమిటంటే.. వీళ్ళిద్దరి పెళ్లి జరిగిన దగ్గర్నుండి నేటివరకు ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలకు చోటు లేకపోవడమే. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఈ జోడి ఎవరికీ నచ్చినట్టువారు ఉంటారు. వృత్తిపరంగా ఇద్దరూ ఎంత బిజీగా వున్నా ఒకరికొరు గౌరవించుకుంటూ గౌరవ ప్రదంగా కలిసి జీవిస్తున్నారు. అందుకే పెళ్ళైన పది నెలలలోపే విడాకులు తీసుకుంటున్న నవతరం దంపతులందరికీ ఈ జంట ఆదర్శం అనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే..
తాజాగా సోషల్ మీడియాలో ‘ఆస్క్ మీ యువర్ క్వశ్చన్’ ఛాటింగ్ లో పాల్గొన్న నమ్రత.. మహేష్ బాబుతో తన పెళ్ళి ఎలా జరిగిందో.. తెలియజేసింది. ప్రేమించడం, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం లాంటి సంఘటనలు సినిమాల్లోనే కాదు. మహేష్ బాబు, నమ్రతల జీవితంలోనూ చోటు చేసుకున్నాయని నమ్రత మాటల ద్వారా తెలుసుకోవచ్చు. 2000 సంవత్సరంలో విడుదలైన ‘వంశీ’ చిత్రంలో మహేశ్, నమ్రత కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మాజీ ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్‌తో ప్రేమలో పడ్డారు. సుమారు ఐదేళ్ళ పాటు వీళ్ళిద్దరూ సక్సెస్ ఫుల్ గా డేటింగ్ ను కొనసాగించిన తర్వాత పెద్దలను ఎదురించి ఫిబ్రవరి 10, 2005న ముంబైలో నిరాడంబరంగా పెళ్ళి చేసుకున్నారు. ఆ విధంగా వివాహ బంధంతో వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. ఆ తర్వాత తొమ్మిదేళ్ల దాంపత్య జీవితంలో మహేష్, నమ్రత ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చారు. వారే గౌతమ్, సితారలు. ప్రస్తుతానికైతే ఇద్దరూ చదువుకుంటున్నారు. నమ్రత శిరోద్కర్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు.
ఆమె చివరిగా నటించిన చిత్రం ‘అంజి’. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ ఛాటింగ్ లో భాగంగా నెటిజన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చింది నమ్రత. “మీకిష్టమైన హీరో ఎవరు.?” అని ఓ అభిమాని అడగటంతో.. “ఇది కాస్త క్లిష్టమైన ప్రశ్ననే.. అయినా సరే ఓపెన్ గా చెప్పేస్తున్నాను. నాకిష్టమైన హీరో అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పడూ మహేష్ బాబే” అని తెలిపింది. మహేష్ సినిమాల్లో తనకు ఒక్కడు, పోకిరి, దూకుడు, మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు చాలా ఇష్టమని, తాను మహేష్ బాబు సినిమాల సెలెక్షన్ విషయాలలో అస్సలు జోక్యం చేసుకోనని నమ్రత తెలిపింది.
మహేష్ కొడుకు గౌతమ్ ఆల్ రెడీ “1-నేనొక్కడినే” సినిమాలో నటించారు. ఆ సినిమాలో గౌతమ్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఏడేళ్ల వయసులో తొలి సినిమాలోనే ఎంతో మెచ్యూరిటీ చూపించి తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకున్నాడు గౌతమ్. అలాగే సితార కూడా చిన్నతనంలోనే సెలబ్రిటీ హోదాను పట్టేసింది..మొత్తానికి టాలీవుడ్ లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులు అన్యోన్య దంపతులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. తన జీవితంలో మధుర క్షణాలు ఏమైనా వున్నాయంటే అవి మహేష్‌ని పెళ్లి చేసుకోవడం, ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడమేనని, భవిష్యత్తులో ఒక్కసారైనా మళ్ళీ మహేష్‌తో కలిసి నటించే అవకాశం వస్తే చూడాలనివుందంటూ ఆమె ఛాటింగ్ ముగించడం ఆసక్తికరంగా మారింది.
అదండి సంగతి.. మొత్తానికి మహేశ్.. నమ్రతల జంట మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ కదా.!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…