Namrata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా మహేష్ బాబు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండగా ఆయన భార్య నమ్రత మాత్రం ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చక్కబెడుతూ ఎంతో బిజీగా ఉండటమే కాకుండా మరోవైపు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు.
ఇకపోతే నమ్రత మహేష్ బాబును పెళ్లి చేసుకోక ముందు వరకు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారక ఓ వెలుగు వెలిగారనే విషయం మనకు తెలిసిందే.అయితే మహేష్ బాబుతో కలిసి వంశీ సినిమాలో నటించిన నమ్రత ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆయనతో ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి నమ్రతం పలు వ్యాపార రంగాలలో రాణిస్తూ మహేష్ సినిమాల గురించి అలాగే కుటుంబం పిల్లల బాధ్యతలను చక్కబెడుతూ గృహనిగా వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నారు.అయితే ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నమ్రతకు ఇదే ప్రశ్న ఎదురైంది. మీకు మహేష్ బాబుతో సినిమాలో నటించే అవకాశం వస్తే నటిస్తారా అనే ప్రశ్న ఎదురైంది.ఈ ప్రశ్నకు నమ్రత సమాధానం చెబుతూ తనకు మహేష్ బాబు సినిమాలో ఎలాంటి కీలకమైన పాత్ర వచ్చిన కూడా తాను సినిమాలలో నటించే ప్రసక్తే లేదని ఈమె కుండ బద్దలు కొట్టినట్టు సమాధానం చెప్పారు. ఇలా నమ్రత మహేష్ సినిమాల గురించి చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…