KA Paul : గ్లోబల్ పీస్ మేకర్ గా అందరికీ తెలిసిన పాల్ పుట్టింది ఆంధ్రప్రదేశ్ చిట్టివలస గ్రామం. పదవ తరగతి కూడా పూర్తి కాని పాల్ మత ప్రచారకుడిగా తన తండ్రితో కలిసి వెళ్తూ అలా గోస్పల్ ఫౌండేషన్ లో అన్నీ తానై క్రిస్టియానిటీ బోధకుడిగా మారారు. తన ఎనిమిదవ ఏట క్రిస్టియనిటీ స్వీకరించిన కే ఆనంద్ పాల్ ఆ తరువాత దేశ విదేశాలలో అగ్ర నాయకులను కలిసి సేవా కార్యక్రమాలకు నిధులను సమాకుర్చుకునేవాడు. ఆయన పీస్ మేకర్ గా అగ్ర నాయకులతో మాట్లాడి ఎన్నో యుద్దాలను జరగకుండా ఆపేసారు అంటూ ఆయన గురించి చెబుతారు. ఎన్నో లక్షల కుటుంబాలకు వారి ఫౌండేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చదువు, ఆరోగ్య సేవలు ఇలా అందిస్తున్న కేఏ పాల్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ చేసారు. పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక నేటి రాజకీయాల గురించి నాయకుల గురించి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఎంతో మంది విద్యార్థులను చదివిస్తున్నా…
కేఏ పాల్ గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చేస్తున్న సామాజిక సేవ గురించి వివరించారు. ఆయన ప్రజాశాంతి పార్టీ ద్వారా పాలిటిక్స్ లోకి అడుగుపెట్టారు. అయితే కేఏ పాల్ గారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు కుటుంబ పాలన గురించి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మీద విమర్శలను గుప్పించారు.
తనని రోల్ మోడల్ గా తీసుకుని అందరూ పనిచేయాలని తాను ఏమీ లేకుండా వచ్చి నేడు బోయింగ్ విమానం ఉన్న ఏకైక వ్యక్తిని అయ్యానంటూ తాను ఎంతో మంది విద్యార్థులను చదివిస్తున్నట్లు తెలిపారు. ఒక విద్యార్ధికి 10 సంవత్సరాలకు 10 లక్షలు చదువుకు అవుతుందంటే నేను అలా ఎంతో మందిని చదివిస్తున్నానని తెలిపారు. ఇద్దరు వితంతువులతో మొదలయిన నా సామాజిక సేవ నేడు మూడు లక్షల మందికి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…