Namrata: మహేష్ బాబు నమ్రత ఇద్దరు సినీ సెలెబ్రెటీలు అయినప్పటికీ ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి గొడవలు పోట్లాటలు లేకుండా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. నమ్రత ముంబై హీరోయిన్ అయినప్పటికీ ఈమె మాత్రం మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు.ఇలా ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తూ ఒక సాధారణ గృహిణిగా ఉండారు.
ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నమ్రతను తిరిగి సినిమాలలో నటించే అవకాశం ఉందా అని ప్రశ్నించగా ఈమె మాత్రం అస్సలు లేదు అని తెలియజేశారు.ఒకవేళ మహేష్ బాబు సినిమాలోని మీకు అవకాశం వస్తే నటిస్తారా అని ప్రశ్నించగా ముందు నాకు మహేష్ బాబు అవకాశం ఇవ్వరు నేను ఎట్టి పరిస్థితులలోనూ సినిమాలలోకి రానని ఈమె తెలియజేశారు.
ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ బాబు సినిమాలలో తనకు నచ్చిన సినిమాలను కూడా తెలియజేశారు. అలాగే నచ్చని సినిమా గురించి కూడా తెలిపారు. మహేష్ బాబు హీరోగా నటించినటువంటి సైనికుడు సినిమా తనకు ఏమాత్రం నచ్చదని నమ్రత తెలిపారు. ఈ సినిమా చూసినటువంటి నమ్రత కోపం వచ్చి ఏకంగా రిమోట్ కూడా పగలగొట్టేసారట.
ఇలా మహేష్ బాబు నటించిన సైనికుడు సినిమా తనకు ఏమాత్రం ఇష్టం ఉండదని నమ్రత తెలియజేశారు అయితే ఈమెకు ఈ సినిమా నచ్చకపోవడానికి కారణం ఏమి లేదు. ఈ సినిమాలో త్రిష మహేష్ బాబు మధ్య రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి.ఇలా మహేష్ బాబు త్రిషతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలలో నటించడంతో జీర్ణించుకోలేకపోయినటువంటి నమ్రత కోపంలో ఏకంగా రిమోట్ కూడా పగలగొట్టారని తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…