Sudheer: బుల్లితెర కమెడియన్ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సుడిగాలి సుదీర్ ఎంతో మంచి ఆదరణ పొందడంతో ఈయనకు సినిమా అవకాశాలు వచ్చాయి ఇలా సినిమా అవకాశాలు రావడంతో బుల్లితెరకు గుడ్ బై చెబుతూ వెండితెర సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సుధీర్ బుల్లితెర కార్యక్రమాలలో చేసే సమయంలో ఈయన యాంకర్ రష్మితో కలిసి భారీ స్థాయిలో సందడి చేశారు.
వీరిద్దరి ఆన్ స్క్రీన్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉండడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. నిజంగానే వీరిద్దరూ నిజజీవితంలో ఒక్కటైతే ఎంతో బాగుంటుందని కూడా ఆకాంక్షించారు. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని కేవలం స్నేహబంధం మాత్రమే ఉందంటూ చెప్పుకొచ్చారు.ఇకపోతే సుదీర్ కు సినిమా అవకాశాలు రావడంతో ఈయన బుల్లితెరకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా సుదీర్ దాదాపు రెండు సంవత్సరాల పాటు బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు అయితే చాలా రోజుల తర్వాత సుధీర్ రష్మీ ఇద్దరు కూడా ఒకే వేదికపై సందడి చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.వీరిద్దరూ బుల్లితెరపై ప్రసారం కాబోతున్నటువంటి ఓ కార్యక్రమంలో జంటగా సందడి చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా రశ్మిపై తనకు ఉన్నటువంటి ప్రేమను సుధీర్ బయట పెట్టారు.
ఈ ప్రోమోలో సుదీర్ మాట్లాడుతూ మేడంగారు ఎందుకో కొంచెం కోపంగా ఉన్నట్టున్నారని అనడంతో వెంటనే రష్మీ ఒరచూపులతో సుదీర్ ని చూస్తూ నువ్వు వస్తావని ఇన్ని రోజులు ఎదురు చూశాను అంటూ చిన్న స్మైల్ ఇస్తూ ఇన్ని రోజులు ఎక్కడున్నావ్ అని ప్రశ్నించింది. రశ్మి మాటలకు సుధీర్ సమాధానం చెబుతూ..నేను ఎక్కడున్నా నా గుండెల్లో నువ్వే ఉన్నావు అంటూ డైలాగ్ చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ సందడి చేశారు.ఇలా చాలా రోజుల తర్వాత వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…