ఈ నెల 10న బాలయ్య బర్త్‌డే రాబోతుంది. అసలు బాలయ్య బాబు పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ హడావిడి మమోలుగా ఉండదుగా.. విషెస్ చెప్పి ఫొటో దిగాలని తెగ ఆరాట పడుతుంటారు. కానీ కరోనా ఉధృతి కారణంగా ఎవరూ తనను కలిసేందుకు రావద్దని బాలయ్య సోషల్ మీడియాలో అభిమానులకు విజ్ఞప్తి చేశాడు
అభిమానులకు ఏ కష్టం వచ్చినా వారికి సాయం అందించేందుకు ముందుండే హీరో బాలయ్య. అభిమానులకు ఎప్పుడూ అండగా ఉండే బాలయ్య సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు చేసిన రిక్వెస్ట్.. ప్రస్తుతం వైరల్‌గా మారింది.
“నా ప్రాణ సమానులైన అభిమానులకు.. ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు.. నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమానం. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక. దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ. ఈ విపత్కాలంలో అసువులు బాసిననా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ ..మీ నందమూరి బాలకృష్ణ.” అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేసారు బాలయ్య.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…