Featured

Nandamuri Balakrishnan : “వసుందరకి తెలిస్తే డబిడి దిబిడే”.. తెలుగు ఇండియన్ ఐడల్ లో బాలయ్య రచ్చ… బాలయ్య జోష్ తో వేరే లెవెల్ కి షో…

Nandamuri Balakrishna : అల్లు అరవింద్ మొదలు పెట్టిన తెలుగు ఓటీటీ ఆహా ఎంతటి ఘన విజయం సాదిస్తోందో తెలిసిందే. అయితే ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ ది ప్రత్యేకస్థానం అనే చెప్పుకోవాలి. బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రాం కారణంగానే ఆహాకు సబ్ స్క్రైబర్ లు పెరిగారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆతరువాత వచ్చిన తెలుగు ఇండియన్ ఐడల్ సింగెర్స్ ప్రోగ్రాం కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది. శ్రీరామ్ చంద్ర హోస్ట్ గా థమన్, నిత్యమీనన్, సింగర్ కార్తిక్ లు జడ్జిలుగా వ్యవహారిస్తున్నారు. ఈ ప్రోగ్రాం టాప్ 6 కంటెస్టెంట్ కు సంబందించిన ప్రోమో ఒక్కటి నెట్ లో హల్చల్ చేస్తోంది.

భార్యని ఏమార్చడం ఎలా…..

తెలుగు ఇండియన్ ఐడల్ టాప్ 6 కంటెస్టెంట్ ప్రోగ్రాంకు బాలయ్య ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే బాలయ్య చేసిన రచ్చ మాత్రం మామూలుగా లేదు. అఖండ సినిమాలో పాట పాడిన సింగర్ ను అభినందిస్తూ…. పెళ్లి చేసుకోబోతున్నావ్ అంట కదా… పెళ్లి ఎపుడు అని అడగను, పెళ్లి ఎందుకు అని అంటాను అని అక్కడితో ఆగకుండా ‘భార్యను ఏమార్చడం ఎలా’ రిటన్ బై ఎన్ బి కే అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ ఎపిసోడ్ వసుంధర చూడకూడదు, చూస్తే మాత్రం దబిడే దిబిడే అని నవ్వులు పూయించారు.

ఇక మరో సింగర్ ని చూసి అందరు కొత్త కంటెస్టెంట్ లు అని చెప్పారు, మరి పూజ హెగ్డేని పిలిచారు ఏంటయ్యా అని ప్రోగ్రాం లో జోష్ పెంచారు. ఇక సింగర్ తో కలసి ఆదిత్య 369 లో “మేక కు తోక తోక కు మేక” అంటూ సందడి చేశారు. ఇలా ప్రోగ్రాం ని తన జోష్ తో వేరే లెవెల్ కి తీసుకు వెళ్లారు బాలయ్య. ఈ ఎపిసోడ్ ఈ రోజు ప్రసారం కానుంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago