Nandamuri Taraka Ratna: నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమా ద్వారా 2002వ సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నందమూరి తారకరత్న.మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన అనంతరం ఏకంగా 13 సినిమాలకు సంతకాలు చేశారు. ఈ విధంగా మొదటి సినిమా తర్వాత ఒకేసారి 13 సినిమాలకు సంతకం చేసిన ఏకైక హీరో తారకరత్న అనే చెప్పాలి.
అయితే ఇందులో కొన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్ల కుండానే ఆగిపోయాయి, మరికొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా హిట్ అవ్వలేదు. అయితే పలు సినిమాలలో నటించిన ఈయనకు హిట్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక తారకరత్న హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. విలన్ గా కూడా తాను ఇండస్ట్రీలో నిలబడలేక ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఈ విధంగా తారకరత్న ఇండస్ట్రీకి దూరం కావడంతో ఈయనను నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టిందని ఆస్తి గొడవలు జరుగుతున్నాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి.అయితే తన గురించి వస్తున్నటువంటి ఇలాంటి వార్తలకు తారకరత్న ఫుల్ క్లారిటీ ఇచ్చారు.చాలా సంవత్సరాల తర్వాత తారకరత్న 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ తాను నందమూరి కుటుంబానికి దూరం కాలేదని, అదే కుటుంబంతో కలిసి ఉంటున్నానని క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే మాకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవని ఈ సందర్భంగా తారకరత్న తెలియజేశారు. ఇకపోతే చాలామంది నేను ఎన్టీఆర్ కి పోటీగా ఇండస్ట్రీలోకి వచ్చానని భావిస్తున్నారు అయితే అందులో ఏ మాత్రం నిజం లేదు ఎన్టీఆర్ ముందుకు వెళ్తున్న, ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న నందమూరి కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్లే కదా అంటూ అన్ని విషయాల గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తారకరత్న చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…