Featured

Auto Ram Prasad: ఒంటరి వాన్ని అయిపోయా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న రామ్ ప్రసాద్… ముగ్గురి స్నేహానికి దిష్టి తగిలిందంటూ ఇంద్రజ కామెంట్స్…!

Auto Ram Prasad : జబర్దస్త్ ద్వారా ఎంతో మంది పైకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు అంది పుచ్చుకుంటున్నారు. అయితే సినిమా అవకాశాలు ఎక్కువ రావడం ఇతర చానెల్స్ నుండి కూడా అవకాశాలు రావడంతో చాలా మంది జబర్దస్త్ ను వీడుతున్నారు. ఇక జబర్దస్త్ లో మొదటి నుండి సుడిగాలి సుధీర్ టీంలో సుధీర్, రామ్ ప్రసాద్, గెట్అప్ శీను మంచి కాంబినేషన్ గా వాళ్ళ స్కిట్లతో అందరిని ఆకట్టుకున్నారు.

ఒంటరి వాడిని అయిపోయాను…..

ఇక ఈ ముగ్గురు అప్పటినుండి మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇన్ని రోజులు కలిసి స్కిట్లు కొట్టిన ఈ ముగ్గురు ఇపుడు జబర్దస్త్ లో కలిసి లేరు. కారణాలు ఏవైనా శీను, సుధీర్ జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు. దీంతో రామ్ ప్రసాద్ ఒంటరిగా మిగిలిపోయాడు. ఇప్పటికే వాళ్లను బాగా మిస్ అవుతున్న రామ్ ప్రసాద్ తాజాగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ వేదిక పై వారి ముగ్గురి ప్రయాణంను స్కిట్ లా చూపించడంతో మరింత ఎమోషనల్ అయ్యాడు. కెవ్వు కార్తీక్, నూక రాజు, రాకేష్ ఈ ముగ్గురు జబర్దస్త్ లో 2013 నుండి సుధీర్, రామ్ ప్రసాద్, శీనుకి సంబంధించిన సంఘటనల ఆధారంగా స్కిట్లను అనుకరించి చూపించారు. ఇక షోలో అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

రష్మీ, జడ్జి గా ఉన్న ఇంద్రజ, సదా కూడా ఎమోషనల్ అయ్యారు. ఇక ఇంద్రజ స్పందిస్తూ మీ స్నేహానికి దిష్టి తగిలినట్టుంది అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక రామ్ ప్రసాద్ మాట్లాడుతూ నేను ఒంటరివాడిని అయిపోయాను అంటూ కంట తడి పెట్టుకున్నారు. ఇక ప్రతిసారి ఈటీవీలో మల్లెమాల ప్రోగ్రామ్స్ నుండి వచ్చే ప్రోమోలకు నెగెటివ్ కామెంట్లు ఇచ్చే వారు. ఈ ప్రోమోకి మాత్రం అందరు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఇక ఎపిసోడ్ ఎంత ఎమోషనల్ గా ఉంటుందో చూడాలి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago