వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం “V” తో పాటు… “టక్ జగదీష్” చిత్రాలను అనౌన్స్ చేసిన నాని ఈ రెండు సినిమాల తరువాత వచ్చే సినిమాకోసం అప్పుడే ప్లాన్ చేసేసారు. “V” చిత్రంలో ముపేన్నడు చేయని విధంగా సీరియల్ కిల్లర్ గా నెగిటివ్ షెడ్ చేస్తున్నారు నాని.
‘నాని’ జన్మదిన వేడుకల సందర్భంగా మరో సినిమాని అనౌన్స్ చేసారు. నాని హీరోగా ‘జెర్సీ’ వంటి చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరోసారి ‘నాని’ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి “రాహుల్ సాంకృత్యన్” దర్శకత్వం వహించనున్నారు. రాహుల్ సాంకృత్యన్.. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘టాక్సీ వాలా’ సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న దర్శకుడు. అందుకే రాహుల్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యువ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ.
కాగా ఈ చిత్రానికి ‘శ్యామ్ సింగ రాయ్’ అనే పేరును ఖరారు చేసారు. చిత్ర కథానాయకుడు గా నాచురల్ స్టార్ నాని నటిస్తున్నారని, కథానాయిను ఇంకా ఎంపిక చేయాల్సి ఉందని తెలుసుతుంది. నాచురల్ స్టార్ ‘నాని’ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించింది చిత్ర యూనిట్. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని, వీడియోను ట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రం 2020 డిసెంబర్ 25 న చిత్రం విడుదల తేదీ కూడా ప్రకటించారు. అయితే హీరో ‘నాని’ కి ఇది 27 వ చిత్రం. చిత్రం ప్రారంభం,చిత్రానికి సంబంధించిన ఇతర నటీ,నట, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…