మాజీ ఎస్వీబీసీ చైర్మన్, వైసీపీ నేత, టాలీవుడ్ కమిడియన్ పృద్విరాజ్… ఎస్వీబిసి మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా మాట్లాడినట్టు వచ్చిన టేపులు అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద రచ్చే జరిగింది. అయితే తాజాగా తనపై వచ్చిన అభియోగాలపై పృథ్వి ఘాటుగా స్పందించారు. తాను ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో మాట్లాడినట్టు బటయకు వచ్చిన టేప్ తో ఏకంగా అయన ఎస్వీబీసీ చైర్మన్ పదవిని కోల్పోవాల్సివచ్చింది. ఈ ఘటన జరిగిన చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న పృథ్వి తాజగా మీడియాతో తన బాధను పంచుకున్నారు.
పదవి కోల్పోయిన తరువాత తాజగా తిరుమలకు కాలినడకన వెళ్ళీ ఆ ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు. అయితే ఆ సమయంలో అయన కొన్ని సంచలన వ్యాఖలు చేసారు. తనను కుట్రపూరితంగా ఎస్వీబిసి నుంచి తరిమేశారని ఆయన అన్నారు.. కాంట్రాక్ట్ పద్దతి ఉన్న ఉద్యోగులను రెగ్యురలైజ్ చేస్తానని హామీ ఇచ్చానని అందువల్లే తనను బయటకు పంపించేందుకు కుట్ర చేసారని వ్యాఖ్యానించారు పృథ్వి. నన్ను బయటకు గెంటేసి వారు మాత్రం పైశాచికానందాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలతో తాను చాలా మానసిక ఆందోళనకు గురయ్యారని చెప్పారు. తన పదవి పోవడానికి కారణం అయినా వారిని ఊరికే వదిలిపెట్టను.. త్వరలో అన్ని నిజాలు బయటపెడతానని వ్యాఖ్యానించారు. తాను ఎప్పటికి ముఖ్యమంత్రి జగన్ కు జవాబుదారిగా ఉంటానని తెలిపారు.
రాజధాని రైతులపై “పెయిడ్ ఆర్టిస్టులంటూ” తాను చేసానని వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు. రాజధాని రైతులను తాను ఎప్పుడు కించపరిచేలా వ్యాఖ్యానించలేదని మరోసారి చెప్పారు. రైతులంటే తనకు అపారమైన గౌరవం ఉందని తెలిపారు.
అయితే ప్రాణం ఉన్నంత వరకు వైసిపిలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు కమిడియన్ పృథ్వి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…