అనసూయ భరద్వాజ్ ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.. అటు బుల్లితెర, ఇటు వెండి తెరపై తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది. “జబర్దస్త్” షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. చాలా ఏళ్లుగా ఈ పోగ్రామ్ కి హోస్ట్ చేస్తుండటం వల్ల ఆమె ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. బుల్లి తెరకు గ్లామర్ తెచ్చిన అతి కొద్దీమంది యాంకర్ లలో అనసూయ ఒకరు. ఈ భామ కేవలం బుల్లితెర మీద యాంకరింగ్ చేయడం మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ అక్కడ కూడా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఒక పక్క యాంకరింగ్, మరో పక్క యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది.
ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ… కొత్త కొత్త ఫోటోషూట్ లతో తన అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. జబర్డస్ట్ కామెడీ షో టైం లో తీసుకున్న హాట్ హాట్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియా ను హీటెక్కించడం ఈ సుందరికి అలవారు. పేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి కిక్కేస్తుంటుంది. 34 ఏళ్ల ఈ ముదురు ఆంటీ హాట్ నెస్ కోసం మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉండటం విశేషం.
ఐతే తాజాగా అనసూయ జబర్దస్త్ ను వదిలేస్తుంది అనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది. జబర్దస్త్ షో నుంచి ఆల్రెడీ నాగబాబు వెళ్లిపోవడం… ఆయనతో పాటు మరికొందరు జబర్దస్త్ కామెడియన్లను తీసుకెళ్లి అక్కడ వేరు కుంపటి పెట్టిన సంగతి తెలిసిందే.. జీ తెలుగు ఛానల్ లో అదిరింది అనే షో చేస్తున్నారు వీరంతా… అయితే ప్రస్తుతం ఎంతగా ప్రయత్నించినా ఆ షోకి పెద్దగా రేటింగ్స్ రావడం లేదట.. అందుకోసం జీ తెలుగు యాజమాన్యం కొన్ని మార్పలు చేయబోతుందట.
ప్రస్తుతం అదిరింది షో లో యాంకర్ గా ఉన్న సమీరా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో, ఆమె మీద చాలా విమర్శలు వస్తున్నాయి. వీటిని పరిగణంలోకి తీసుకున్న జీ తెలుగు యాజమాన్యం సమీరాను పక్కకు పెట్టి… అనసూయను తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టిందట.
ఇప్పటికే జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్ షో చేస్తున్న అనసూయకు అదిరింది షో కోసం భారీగానే ఆఫర్ ఇచ్చారట. మల్లెమాల ఇస్తున్న రెమ్యూనరేషన్ కంటే డబుల్ ఇచ్చేందుకు జీ తెలుగు వారు సిద్ధంగా ఉన్నారని వినికిడి. నేడో, రేపో అనసూయ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పి అదిరిందిలో సర్ప్రైజ్ ఇస్తుంది అని అంటున్నారు. డబుల్ రెమ్యూనరేషన్ వస్తుంటే షో మారడంలో తప్పు లేదనేది కొందరి వాదన.
అయితే అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్తే.. ఎక్స్ ట్రా జబర్దస్త్ చేస్తున్న రష్మీ గౌతమ్ జబర్దస్త్ ను కూడా హోస్ట్ చేయనుందని చెబుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…