Categories: FeaturedMovie News

రాజీవ్ కనకాల సంపాదనపై సుమ అదిరిపోయే పంచ్ వేసింది… దెబ్బకి జాఫర్ నోట మాటరాలేదు…

సుమ కనకాల.. తెలుగునాట బుల్లితెరపై మకుటంలేని మహారాణి. గత పాతిక సంవత్సరాలుగా టీవీ ప్రేక్షకులను తన మాటల చాతుర్యంతో, స్పాంటేనిటీతో అలరిస్తూ వస్తున్నారు సుమ కనకాల. టెలివిజన్ రంగంలో నంబర్ 1 స్థానంలో ఉండటం మెమోలు విషయం కాదు. రోజుకో కొత్త యాంకర్ వచ్చి తమ గ్లామర్ షోలు చేస్తున్నా అభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు.. అలాంటిది కొంచెం కూడా అసభ్యతకి తావివ్వకుండా యాంకరింగ్ చేయడం ఈరోజుల్లో చాలా కష్టమే… అసభ్యత తావివ్వకుండా, వివాదా రహితంగా యాంకరింగ్ చేస్తూ అభిమానులను సంపాదించుకుంటున్న ఏకైక యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆమె సుమ కనకాల మాత్రమే. అంతే కాదు…పాతికేళ్లుగా ఆమె కెరీర్ దూసుకుపోతుంది. మరో పదేళ్లు ఈజీగా ఇండస్టీలో నంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది..

తెలుగు రాష్ట్రంలో పుట్టి కూడా స్పష్టమైన తెలుగులో మాట్లాడటం చేతకాని ఈరోజుల్లో… ఎక్కడో కేరళలో పుట్టి, తెలుగుఅమ్మాయిల కంటే స్పష్టంగా తెలుగు మాట్లాడటం ఒక్క సుమకి మాత్రమే చెల్లుతుంది. అయితే సుమ ఒక్క షోకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు…? అసలు సుమ రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడు ఎదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది.. ఆమె రెమ్యూనరేషన్ హీరోయిన్ల కంటే అధికంగా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వ్యాఖలపై సుమ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ షోలో జర్నలిస్ట్ స్పెషల్ అంటూ ఒక ఎపిసోడ్ చేసారు. అందులో జర్నలిస్టులు, న్యూస్ రీడర్లు పార్టిసిపెంట్స్ గా హాజరయ్యారు.

Courtesy by MallemalaTV

వచ్చిన వారిలో “ముఖ ముఖి” జాఫర్ కూడా ఒకరు.. ఐతే ఇక్కడ జాఫర్ ముఖా ముఖి ప్రోగ్రానికి ఇమిటేట్ చేస్తూ… నోస్ తో నోస్ అని మరో స్కిట్ చేసారు… ఒక పక్క టిఎన్ఆర్… మరో పక్క జాఫర్ కూర్చొని ఉంటే మధ్యలో సుమ కూర్చోబెట్టి ఇద్దరు కలిపి సుమని ఫన్నీ గా ఇంటర్వ్యూ చేసారు.

Courtesy by MallemalaTV

ఇందులో భాగంగా జాఫర్ అడిగిన ప్రశ్నకు తనదైన రీతిలో ఆన్సర్ ఇచ్చింది సుమ. “మీ భర్త రాజీవి కనకాల ఎంత సంపాదిస్తున్నారు… ఆయన సంపాదన కంటే మీరు ఎక్కువ సంపాదిస్తున్నారంట కదా..” అని జాఫర్ అడగగా… ఒక్క క్షణం ఆలోచించకుండా పంచ్ వేసింది సుమ. ఈ ప్రశ్న అడిగిన తరువాత మీకు క్రింద కొన్ని కామెంట్స్ వస్తాయి.. నీకెందుకురా…. అని ఘాటుగా పెడతారు అవసరమా ఇప్పుడు అంటూ చెప్పింది. ఆమె మాటలు వినగానే అక్కడ అందరు నవ్వుకున్నారు. అయితే రాజీవ్ కనకాల కంటే సుమ ఎక్కువగా సంపాదిస్తున్నారన్నది అందరికి తెలిసిన విషయమే.. ఈ విషయంపై ఆల్రెడీ రాజీవ్ కనకాల ఒక ఇంటర్వూలో ఒప్పుకున్నాడు కూడా..

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago