Categories: FeaturedMovie News

ఆ హీరోయిన్ ముందు తేలిపోయిన నాని…!!

రాజా రాణి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్.. ఆ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన ‘నజ్రియా నటనను, అలాగే ఆమె పలికించిన హావభావాలను అంత తేలిగ్గా ఎవ్వరూ మరచిపోలేరు. కేటీఆర్ లాంటి నాయకుడు కూడా ఈ తరంలో తనకిష్తమైన నటి ఎవరంటే.. నజ్రియానే అని పబ్లిక్ ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పారంటే కారణం..నజ్రియా నటనా సామర్ధ్యాలే.

అప్పట్లో ఆమె కళ్ళను ఆ కళ్లల్లో మెరిసిన ఎక్స్ ప్రెషన్స్ ను చూసి చాలామంది మనసు పారేసుకున్నారు.అయితే ఆ తర్వాత మళ్లీ ఈ బ్యూటీ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఎట్టకేలకూ తెలుగు ప్రేక్షకుల మనసులను రంజింపజేయడానికి నాని సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెడుతుంది. ‘అంటే సుందరానికి’ అనే సినిమా నజ్రియాకు తెలుగులో డైరెక్ట్ మొదటి సినిమా. ఇప్పటికే నజ్రియా ఈ సినిమా సెట్స్ లో కూడా పాల్గొంది.

అయితే ఈ బ్యూటిఫుల్ హీరోయిన్, హీరో నానితో పోటీ పడి నటిస్తోంది. కొన్ని సీన్స్ లో అయితే, నాని లాంటి నేచురల్ స్టార్ ను కూడా పూర్తిగా డామినేట్ చేస్తోందట.ఈ సినిమా కోసం ఇప్పటికే పది రోజులు పాటు షూటింగ్ చేసింది నజ్రియా. కాగా ఆమె సీన్స్ చాల బాగా వచ్చాయట. ముఖ్యంగా నానితో సాగే సీన్స్ లో అయితే ఆమె ముందు అసలు నాని పూర్తిగా తేలిపోయాడని, నజ్రియా తన కళ్ళతోనే అద్భుతమైన ఫీల్ ను క్రియేట్ చేసిందని చిత్రయూనిట్ నుండి అందుతున్న సమాచారం.

సహజంగా హీరోయిన్లను బాగా నటించమని ఎంకరేజ్ చేసే నాని, నజ్రియా విషయంలో మాత్రం అందుకు అపోజిట్ లో ప్రవర్తిస్తున్నాడట. మొత్తానికి నానిలో ఇప్పడు టెన్షన్ మొదలైంది.తనది చాల న్యాచురల్ పెర్ఫామెన్స్ అనే.. నానికి నేచురల్ స్టార్ అనే బిరుదు వచ్చింది. కానీ నజ్రియా నేచురల్ నటన ముందు ఈ నేచురల్ స్టార్ నటన చాల అసహజంగా ఉందట. అందుకే నాని, నజ్రియాకి నటన విషయంలో సలహాలు సూచనలు ఇవ్వకుండా, పైగా ఆమెకు తెలుగు రాదు కాబట్టి.. సీన్ పేపర్ లో ఆమెను కన్ ఫ్యూజ్ చేస్తూ.. ఎలాగోలా ఆమెను డామినేట్ చేయడానికి, నానా తిప్పలు పడుతున్నాడట మన నాని…!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago