Movie News

మహేష్ తో తెలంగాణ పోలీస్.. బీ అలెర్ట్..!!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రోజు రోజుకి కేసుల సంఖ్యపెరిగిపోతూ వస్తోంది.. ఇలాంటి నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను పోలీసులు భుజానకెత్తుకున్నారు. ఎవరితో చెప్పిస్తే బాగా ప్రజల్లోకి వెళుతుందో వారితేనే చెప్పిస్తున్నారు. ముఖ్యంగా క్రేజ్ ఉన్న సినీ తారల వీడియోలు, వాయిస్ లతో తెలంగాణ పోలీసులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది.ఈ మహమ్మారి వ్యాప్తికి కళ్లెం వేసేందుకు అన్ని ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. మాస్క్ ధరించడం.. భౌతిక దూరం పాటించడం సహా కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజ్ఞప్తి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు ప్రజలకు కరోనా అవగాహన కల్పించేందుకు మహేష్ బాబును వాడుకున్నారు. ఆయన డైలాగులతో వినూత్న ప్రచారం మొదలు పెట్టారు.

మహేష్ బాబు మాస్క్ ధరించి ఉన్న ఓ ఫొటోతో ప్రత్యేక వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. మాస్క్, కరోనా రక్షణ నిబంధనలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.’జీవితం అనేది ఒక యుద్ధం.. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు.. అప్రమత్తంగా ఉండండి.. మిమ్మల్ని మీరు రక్షించుకోండి’ అని మహేష్ బాబు చెప్పిన సినిమా డైలాగులను ఈ వీడియోలో జొప్పించారు. అవగాహన కల్పించేలా ఉండడంతో దీన్ని నెటిజన్లు షేర్లు, కామెంట్లు చేస్తూ హోరెత్తిస్తున్నారు..

ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా కరోనా వల్ల మళ్ళీ ఆగిపోయింది..ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు..!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago