నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొత్త సినిమా టీజర్ తో ఓ సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసాడు.. సీనియర్ హీరోల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన రజినీ ‘కబాలి’ టీజర్ 37 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను, బాలయ్య ‘అఖండ’ టీజర్ 38 మిలియన్ల వ్యూస్ తో బ్రేక్ చేసింది. మొత్తానికి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ రికార్డ్ ను, బాలయ్య బ్రేక్ చేయడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలయ్య ఖాతాలో ఒక సరికొత్త రికార్డ్ అయితే చేరింది.
ఈ ‘అఖండ’ టీజర్ తో అనూహ్యంగా ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ టీజర్ బాలయ్య అభిమానులతో పాటు యావత్తు ప్రేషకులను సైతం ఆకట్టుకోవడం విశేషం.మొత్తానికి ఈ టీజర్ ఈ రికార్డ్ ను సాధించి బాలయ్యకి ఇంకా స్టార్ డమ్ ఉందని నిరూపించింది. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ డీల్ కూడా ఫినిష్ అయింది.
19 కోట్ల రూపాయలకు స్టార్ మా సంస్థ ‘అఖండ’ శాటిలైట్ రైట్స్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి కూడా భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం డిజిటల్ రైట్స్ డీల్ కోసం పలు సంస్థలు అఖండ నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. డిజిటల్ రైట్స్ కి చిత్రయూనిట్ సుమారు 22 కోట్లు అడుగుతున్నట్లు టాక్.ఎలాగూ బాలయ్య సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో మంచి వ్యూస్ వస్తుంటాయి. అలాగే బోయపాటి సినిమాకి కూడా పల్లెటూరి జనంలో మంచి క్రేజ్ ఉంటుంది..
ఆ వర్గం ప్రేక్షుకులు డిజిటల్ ప్లాట్ ఫామ్ కి కొత్త కస్టమర్స్ అవుతారు. అందుకే ఓటిటీ ప్లాట్ ఫామ్స్ అఖండ కోసం పోటీ పడుతున్నాయి. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి, ఆ తర్వాత దాన్ని మించిన సినిమా ‘లెజెండ్’ రూపంలో ఇచ్చి బాలయ్య కెరీర్ లోనే చిరస్థాయిగా నిలిచిపోయే విజయాన్ని అందించాడు. ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ అందించాలనే కసితో బోయపాటి ఈ ‘అఖండ’ సినిమాని తీర్చిదిద్దుతున్నారట…!!
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…