మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచింది ‘రంగస్థలం’ చిత్రం..ఈ సినిమాలో చరణ్ ఉత్తమ నటనను కనబరిచాడు.. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఇది 2018లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి వీరిద్దరూ మరోసారి కలిసి చేయాలని అభిమానులు కోరుకున్నారు. మీడియాలో వచ్చిన తాజా సమాచారం ప్రకారం..రంగస్థలం-2 సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ మరోసారి సుకుమార్‌తో కలిసి పనిచేయాలనుకున్నట్లు సమాచారం. ఇవన్నీ త్వరలో జరుగునున్నాయి.రంగస్థలంలో రామ్ చరణ్ నటనకు చాలా మంచి పేరు వచ్చింది. రంగస్థలంతో జాతీయ మీడియాలోనూ రాంచరణ్ కు గుర్తింపు దక్కింది. ఈ చిత్రం ఖచ్చితంగా నటుడు – దర్శకుడికి ఇద్దరికీ ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది.తన ప్రస్తుత చిత్రం ‘పుష్పా’ను తీసిన వెంటనే సుకుమార్ రామ్ చరణ్ తో కలిసి పని చేస్తాడని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తానన్న సుకుమార్ దాన్ని పక్కనపెట్టి రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రంగస్థలం 2 తీస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.అయితే సుకుమార్- విజయ్ చిత్రం లైవ్ లోనే ఉందని.. ఈ ఊహాగానాలను చిత్ర నిర్మాతలు ఖండించారు, ఎటువంటి మార్పులు లేకుండా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోందని ధృవీకరించారు. కాబట్టి, పుష్పా తర్వాత విజయ్ దేవరకొండ చిత్రంతో సుకుమార్ ముందుకు సాగనున్నారు.
సుకుమార్ విజయ్ సినిమాను చుట్టే సమయానికి, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మరియు దర్శకుడు శంకర్ తో మరో సినిమాను కూడా పూర్తి చేస్తాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ‘రంగస్థలం2’ తీసే చాన్స్ ఉంది. ఈ రెండవ చిత్రం పూర్తికావడానికి దాదాపు రెండు సంవత్సరాలు పడుతుంది. ఇది రంగస్థలం సీక్వెల్ ఉంటుందని మాత్రం టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి…!!
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…