కరోనా, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గతంతో పోలిస్తే ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గింది. లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోగా, గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుని రైతులకు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రెండు కొత్త స్కీమ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రైతులకు, నిరుద్యోగులకు కేంద్రం ప్రయోజనం కలిగేలా చేస్తోంది.
కోల్డ్ చైన్ స్కీమ్, బ్యాక్‌వర్డ్ అండ్ ఫార్వార్డ్ లింకేజ్ స్కీమ్ లకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ రెండు పథకాల అమలు ద్వారా కేంద్రం యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు రైతులకు ఆదాయం పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది. కేంద్రం కోల్ చైన్ స్కీమ్ లో భాగంగా 21 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా 443 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కోసం ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఈ స్కీమ్ వల్ల తెలుగు రాష్ట్రాల రైతులతో పాటు ఇతర రాష్ట్రాల రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. రైతులు పంట వేసినప్పటి నుంచి అమ్మే వరకు ప్రయోజనం చేకూరేలా 2 లక్షల మంది రైతులు, 12600 యువతకు ప్రయోజనం కలిగేలా కేంద్రం ఈ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ కోసం కేంద్రం ఉద్యోగులను నియమించుకోనుంది.
బ్యాక్‌వర్డ్ అండ్ ఫార్వరన్డ్ లింకేజ్ స్కీమ్ ద్వారా కేంద్రం 2,500 మంది ఉపాధి కల్పించడంతో పాటు ఈ స్కీమ్ కోసం 62 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. కేంద్రం ఈ స్కీమ్స్ తో రైతులకు ముడి పదార్థాలను, కోల్డ్ స్టోరేజ్ లను, అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…