రైతులకు, నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త.. ఆ పథకాలకు గ్రీన్ సిగ్నల్..?

0
252

కరోనా, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గతంతో పోలిస్తే ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గింది. లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోగా, గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుని రైతులకు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రెండు కొత్త స్కీమ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రైతులకు, నిరుద్యోగులకు కేంద్రం ప్రయోజనం కలిగేలా చేస్తోంది.

కోల్డ్ చైన్ స్కీమ్, బ్యాక్‌వర్డ్ అండ్ ఫార్వార్డ్ లింకేజ్ స్కీమ్‌‌ లకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ రెండు పథకాల అమలు ద్వారా కేంద్రం యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు రైతులకు ఆదాయం పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది. కేంద్రం కోల్ చైన్ స్కీమ్ లో భాగంగా 21 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా 443 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కోసం ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది.

ఈ స్కీమ్ వల్ల తెలుగు రాష్ట్రాల రైతులతో పాటు ఇతర రాష్ట్రాల రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. రైతులు పంట వేసినప్పటి నుంచి అమ్మే వరకు ప్రయోజనం చేకూరేలా 2 లక్షల మంది రైతులు, 12600 యువతకు ప్రయోజనం కలిగేలా కేంద్రం ఈ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ కోసం కేంద్రం ఉద్యోగులను నియమించుకోనుంది.

బ్యాక్‌వర్డ్ అండ్ ఫార్వరన్డ్ లింకేజ్ స్కీమ్ ద్వారా కేంద్రం 2,500 మంది ఉపాధి కల్పించడంతో పాటు ఈ స్కీమ్ కోసం 62 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. కేంద్రం ఈ స్కీమ్స్ తో రైతులకు ముడి పదార్థాలను, కోల్డ్ స్టోరేజ్ లను, అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం.