Naresh : ప్రస్తుతం టాలీవుడ్, శాండల్ వుడ్ లో తెగ వైరల్ అవుతున్న పేర్లు నరేష్, పవిత్ర లోకేష్. సినిమాలతో మంచి గుర్తింపు ఉన్న నరేష్ కి ప్రస్తుతం మాత్రం పెళ్లిళ్లతో బాగా వైరల్ అవుతున్నారు. ఇన్ని రోజులు ఈయనకు మూడు పెళ్లిళ్లు జరిగాయనే సంగతి చాలా మందికి తెలియదు. ఇక ఇప్పుడు మాత్రం ఈయన పవిత్ర లోకేష్ తో చట్టాపట్టాలు వేసుకుని తిరగడంతో ఈయన పెళ్లిళ్ల బాగోతం బయటికి వచ్చింది ఇక పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నట్లు వార్తలను నేపథ్యంలో అసలు ఈయన ముందు పెళ్లిళ్ల గురించి మాజీ భార్యల గురించి ఆరాలు తీస్తున్నారు.
నరేష్ మాజీ భార్యల బ్యాక్ గ్రౌండ్ ఏమిటి…
నరేష్ విజయనిర్మల మొదటి భర్త కృష్ణ మూర్తికి పుట్టిన సంతానం. విజయ నిర్మల ఆమె మొదటి భర్తతో విడాకులు తీసుకుని సూపర్ స్టార్ కృష్ణ ను మళ్ళీ వివాహం చేసుకున్నారు. ఇక చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన నరేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గాను ఆ తరువాత హీరోగాను తల్లి విజయనిర్మల దర్శకత్వంలో సినిమా చేసారు. ఇక విజయనిర్మల గారు యుక్తవయసులోనే నరేష్ కు డాన్స్ మాస్టర్ శ్రీను గారి అమ్మాయితో వివాహం చేసారు. వారికి ఒక కుమారుడు నవీన్ విజయ కృష్ణ ఉన్నారు. తాను సినిమాల్లోకి హీరోగా నందని నర్సింగ్ హోమ్ సినిమా ద్వారా పరిచయమయ్యాడు. ఇక వారిద్దరికీ అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోయారు. ఇక నరేష్ మళ్ళీ రెండో పెళ్లి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలు రేఖ సుప్రియ ను పెళ్లి చేసుకున్నారు.
వీరికి ఒక అబ్బాయి తేజ ఇతను చిత్రకారుడు అనిమేషన్ నేర్చుకుంటున్నాడు. ఇక వీళ్లిద్దరికి గొడవలు రావడంతో విడిపోయారు. ఇక విడిపోయినా కూడా రేఖ సుప్రియ తో కలిసి నరేష్ చెన్నై లోని ఒక ఎన్జీఓ కోసం ఇప్పటికి పనిచేస్తున్నారు. ఇక మళ్ళీ నరేష్ గారు 2010 లో పెళ్లి చేసుకున్నారు. రమ్య రఘుపతి కాంగ్రెస్ సీనియర్ లీడర్, రఘువీర రెడ్డి తమ్ముడి కూతురు. ఇక ఈమెతో కూడా మనస్పర్థలు వచ్చి విడాకులకు దరఖాస్తూ చేసారు నరేష్. వీరికి ముగ్గురు మగపిల్లలు ఉన్నారు. ఇక ఇపుడు రమ్య రఘుపతితో దూరంగా ఉంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో సహజీవనం అంటూ రచ్చ చేస్తున్నాడు 62 ఏళ్ల నరేష్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…