Naresh -Pavitra Lokesh: ప్రముఖ హీరోయిన్ విజయనిర్మల తనయుడు నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన మంచి గుర్తింపు పొందిన నరేష్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో నరేష్ కి ఉన్న సంబంధం వల్ల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. కొంతకాలం వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
ఇక నరేష్ తన మూడవ భార్యకి విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ తో సహజీవనం చేయటంతో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయంగా మారింది.
కొన్ని రోజులుగా బయట ఎక్కడ కనిపించని నరేష్ తాజాగా పవిత్ర లోకేష్ తో కలిసి ఉన్న వీడియో షేర్ చేయటంతో మళ్లీ వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా నరేష్ పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్లు ప్రకటించటంతో వీరి పెళ్లి టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇదివరకే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు దూరంగా ఉంటున్నాడు. గత మూడు సంవత్సరాలుగా పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న నరేష్ తాజాగా తనని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అంతేకాకుండా పవిత్ర లోకేష్ నరేష్ ముద్దు పెట్టుకున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నటుడిగా మంచి గుర్తింపు పొందిన నరేష్ మొదట సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకొని ఒక కొడుకు పుట్టిన తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలిని రెండవ వివాహం చేసుకొని ఆమెకు ఒక కొడుకు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని దూరమయ్యారు.
ఇక మాజీ మంత్రి రఘువీరారెడ్డి చెల్లెలి కుమార్తె రమ్య రఘుపతిని మూడవ వివాహం చేసుకున్న నరేష్ కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటంతో ఆమెకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన పవిత్ర లోకేష్ తో కొంతకాలంగా సహజీవనం చేస్తున్న నరేష్ ఇప్పుడు నాలుగవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే ఇలా ఆరుపదుల వయసులో నాలుగో వివాహం చేసుకోవడానికి సిద్ధపడటంతో నరేష్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…