Narra Venkateswara Rao : నర్రా వెంకటేశ్వరరావు… ఈయన గురించి తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలతో నటించడమే కాకుండా వారి వారసులతో కూడా కలసి నటించారు. తన సినీ ప్రస్థానంలో దాదాపు 500 సినిమాలలో నటించిన నర్రా వెంకటేశ్వరరావు 1974 లో వచ్చిన ‘చదువు సంస్కారం’ అనే సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఈయన ఆఖరుగా చేసిన సినిమా ‘మేస్త్రి’. ముప్పై సంవత్సరాల సినీ అనుభవంలో సినిమాలో విలన్ పాత్రలు మాత్రమే కాకుండా సహాయక పాత్రలలో కూడా నటించి మెప్పించారు.
సినిమాలలో కష్టపడి సంపాదించిన మొత్తాన్ని అలా…
నర్రా వెంకటేశ్వరరావు గారికి ముఖ్యంగా దాసరి నారాయణరావు గారి సినిమాలో మంచి పాత్రలు లభించేవి. ఆయన ఏదయినా సినిమాలో నటించారు అంటే ఆ పాత్ర మాత్రమే కనిపించేది అంతలా నటనలో జీవించేవారు. నర్రా వెంకటేశ్వరరావు గారి భార్య సుశీల, వీరికి ఇద్దరు పిల్లలు కొడుకు మురళి, కూతురు వసంత లక్ష్మి. ఆయనకు 62 ఏళ్ళ వయసులో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. అయితే చనిపోయే ముందు ఆయన చేసిన పని మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
ఆయన సినిమాలలో కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తాన్ని చనిపోయే ముందు ఒంగోలుకు చెందిన ప్రజానాట్య మండలికి రాసిచ్చారట. చిన్నతనం నుండి నాటకాలు వేసిన అనుభవం, వాటి మీద ఇష్టంతో ఆ నాట్యమండలి కి భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బంది రాకూడదని ఆయన ఆస్తి మొత్తాన్ని ఆ నాట్యమండలికి దానం చేశారు. సంపాదించిన మొత్తాన్ని అలా చేశారని తెలుసుకున్న వారందరూ ఆయనకు, ఆయన చేసిన పనికి ఫిదా అవుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…