Categories: Political News

టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు వీడియోపై టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆగ్రహం.. ప్రతిపక్షాలకు సవాల్

గుంటూరు: సోషల్ మీడియాలో తనపై వైరల్ అవుతున్న రాసలీలల వీడియోపై గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తీవ్రంగా స్పందించారు. ఈ వీడియో పూర్తిగా ఫేక్ అని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా చేసిన ప్రచారం అని ఆయన స్పష్టంచేశారు.

Naseer Ahmed gives clarity on Guntur TDP MLA’s viral video..!

నసీర్ అహ్మద్ మాట్లాడుతూ, “ప్రజాప్రతినిధులపై తప్పుడు ఆరోపణలు చేయడానికి నకిలీ కంటెంట్‌ను వ్యాప్తి చేయడం రాజకీయ నైతికతకు విరుద్ధం. గుంటూరు ఈస్ట్‌లో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా ఎగురుతుంటే చూడలేక ప్రతిపక్షాలు ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నాయి,” అని విమర్శించారు.

సాక్షి ఛానల్‌పై ఎమ్మెల్యే ప్రశ్న

“సాక్షి ఛానల్ నిజాలను చూపించడానికేనా? లేక ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనా?” అని నసీర్ అహ్మద్ సూటిగా ప్రశ్నించారు. ఈ వీడియో నిజమని నిరూపించాలని ఆయన ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.

న్యాయపరమైన చర్యలకు హెచ్చరిక

ఈ వీడియోపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని, ఫోరెన్సిక్ నిపుణులతో వీడియోను పరిశీలించి, ఈ కుట్రలో భాగమైన వారందరిపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇలాంటి నీచపు చర్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. చివరగా, ప్రజలకు పిలుపునిస్తూ, “ఇలాంటి నకిలీ ప్రచారాలను నమ్మవద్దు. నిజం వైపు నిలబడండి. ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు మానుకొని, చేతనైతే ప్రజల కోసం పనిచేయండి” అని నసీర్ అహ్మద్ సందేశం ఇచ్చారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago