గుంటూరు: సోషల్ మీడియాలో తనపై వైరల్ అవుతున్న రాసలీలల వీడియోపై గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తీవ్రంగా స్పందించారు. ఈ వీడియో పూర్తిగా ఫేక్ అని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా చేసిన ప్రచారం అని ఆయన స్పష్టంచేశారు.

నసీర్ అహ్మద్ మాట్లాడుతూ, “ప్రజాప్రతినిధులపై తప్పుడు ఆరోపణలు చేయడానికి నకిలీ కంటెంట్‌ను వ్యాప్తి చేయడం రాజకీయ నైతికతకు విరుద్ధం. గుంటూరు ఈస్ట్‌లో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా ఎగురుతుంటే చూడలేక ప్రతిపక్షాలు ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నాయి,” అని విమర్శించారు.
గత 20 సంవత్సరాలు గా గుంటూరు ఈస్టులో తెలుగుదేశం జెండా ఎగరన్నటువంటి సందర్భంలో ఈసారి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈస్ట్ లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటం చూడలేక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాపై తప్పుడు ప్రచారం దిగజారుతున్నారు ప్రతిపక్షాల పార్టీలవారు నేరుగా వారిని ఒకటి… pic.twitter.com/25oc1mkeHs
— Mohammed Naseer (@mdnaseer_tdp) August 4, 2025
సాక్షి ఛానల్‌పై ఎమ్మెల్యే ప్రశ్న
“సాక్షి ఛానల్ నిజాలను చూపించడానికేనా? లేక ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనా?” అని నసీర్ అహ్మద్ సూటిగా ప్రశ్నించారు. ఈ వీడియో నిజమని నిరూపించాలని ఆయన ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
న్యాయపరమైన చర్యలకు హెచ్చరిక
ఈ వీడియోపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని, ఫోరెన్సిక్ నిపుణులతో వీడియోను పరిశీలించి, ఈ కుట్రలో భాగమైన వారందరిపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇలాంటి నీచపు చర్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. చివరగా, ప్రజలకు పిలుపునిస్తూ, “ఇలాంటి నకిలీ ప్రచారాలను నమ్మవద్దు. నిజం వైపు నిలబడండి. ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు మానుకొని, చేతనైతే ప్రజల కోసం పనిచేయండి” అని నసీర్ అహ్మద్ సందేశం ఇచ్చారు.
ఇటీవల సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించి నేను స్పందించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. ప్రజాప్రతినిధి మీద తప్పుడు ఆరోపణలు చేయడానికి ఎడిటెడ్ వీడియోలు, ఫేక్ కంటెంట్ ను వ్యాప్తి చేయడం రాజకీయ నైతికతకి పూర్తి విరుద్ధం. ఈ వీడియో పూర్తిగా ఫేక్ గా తయారు చేయబడిందని… pic.twitter.com/DXv76hBBsb
— Mohammed Naseer (@mdnaseer_tdp) August 4, 2025



































