Natti Kumar : ఎన్టీఆర్ గారి చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఆగష్టు 1 వ తేదీన ఇంట్లో ఉంటి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ షాక్ నుండి నందమూరి కుటుంబ సభ్యులు ఇంకా తేరుకోకముందే ఈ ఇష్యూని రాజకీయం చేస్తున్నారు కొంతమంది. ఆమె ఆత్మహత్య చేసుకోడానికి లోకేష్ తో వివాదాలు కారణం అంటూ ఆరోపించారు. ఇక లక్ష్మి పార్వతి ఏకంగా ఉమా మహేశ్వరి మరణించాక చంద్రబాబు ఆమె రాసిన సుసైడ్ లెటర్ ను మాయం చేసాడని, ఈ ఉదంతం పై సిబిఐ ఎంక్వయిరీ చేయాలంటూ మీడియా మీటింగ్ పెట్టి మరీ ఆరోపించింది. ఇక అటు కొంతమంది వైసీపీ నేతలు కూడా ఉమా మహేశ్వరి మృతి పై చంద్రబాబు ను, లోకేష్ ను ఆమె చావుకు కారణం మీరే అంటూ ఆరోపిస్తున్నారు. ఒక వైసీపీ నేత ట్విట్టర్ వేదికగా హెరిటేజ్ లో ఉమా మహేశ్వరి గారికి వాటా ఉండటం వల్ల ఆ విషయంలో లోకేష్ కి ఉమా గారికి గొడవ జరిగిందంటూ ఆరోపించారు.
ఈ సమయంలో రాజకీయం అవసరమా…
ఇక ఫిల్మ్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఈ ఇష్యూ మీద మాట్లాడారు. ఎన్టీఆర్ గారి కూతురు మరణించి ఆయన కుటుంబం బాధలో ఉంటే ఇలాంటి ఆరోపణలు ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. రాజకీయాలంటే వ్యక్తిగత విషయాల గురించి చేయకూడదంటూ చెప్పారు. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ భార్య కదా మరి ఇంట్లో ఒక విషాదం జరిగినపుడు వీలైతే పరామర్శించి ధైర్యం చెప్పాలి అంతే కానీ ఇలాంటి ఆరోపణలను చేసి వారిని మరింత బాధపెట్టకూడదు. చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే ఆయన మీద విమర్శలు చేయొచ్చు ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని ఎందుకు లాగడం. చనిపోయిన ఆయన కూతురుని రాజకీయంగా వాడుకోవడం ఏమిటి అంటూ అభిప్రాయపడ్డారు. ఎవరైనా చనిపోయిన వారి మీద రాజకీయం చేయటం తప్పు అంటూ మాట్లాడారు.
ఆస్తి గురించి గొడవ అనే ఆరోపణలలో నిజం లేదని, ఎన్టీఆర్ గారు కూతుర్లకు కొడుకులకు సమానంగా ఆస్తి పంచారని చెప్పారు. ఇక ఒకవేళ ఆస్తి గురించి ఏదైనా ఉన్నా ఆమె తరువాత ఆస్తి కూతుర్లకు వస్తుంది ఈ విషయం అందరికీ తెలుసు. అయిన రాజకీయాల కోసం వాడుకుంటారా అని అన్నారు నట్టి కుమార్. వాళ్ళేదో విషాదం లో ఉంటే ఆమె ఇందుకు చనిపోయింది, అందుకు చనిపోయింది అంటూ మాట్లాడటం మంచిది కాదు అని అభిప్రాయపడ్డారు. అనారోగ్య సమస్యలను వల్ల ఆమె మరణిస్తే పోస్టుమార్టం లో కూడా ఆమెది ఆత్మహత్య అని తెలిసినా కూడా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని నట్టి వాఖ్యణించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…