Categories: FeaturedMovie News

Venu Thottempudi : విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ తో సినిమా సెట్ చేస్తే ఆర్పి పట్నాయక్ చేయనన్నాడు : వేణు తోట్టెంపూడి

Venu Thottempudi : 1999 లో వచ్చిన ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన హీరో వేణు ఆ తరువాత చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఉరేళితే, కళ్యాణ రాముడు, సదా మీ సేవలో వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. అయితే ‘దమ్ము’ సినిమా తరువాత ఇండస్ట్రీ కి దూరమైన వేణు దాదాపు తోమిదేళ్ల తరువాత మళ్ళీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో ప్రేక్షకులకు కనిపించారు. అయితే సినిమాల్లోకి వచ్చిన మొదట్లో అతను ఎదుర్కొన్న ఇబ్బందులను మొదటి సినిమా అనుభవాలను పలు ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు వేణు.

స్వయంవరం సినిమాకోసం అన్నీ సిద్ధం అయ్యాక ఆర్పి మ్యూజిక్ చేయనన్నాడు…

సినిమాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో చెన్నై లోనే ఉన్న వేణు కి త్రివిక్రమ్, సునీల్, ఆర్పి పట్నాయక్, చంద్ర సిధార్థ్ వంటి వారితో పరిచయాలు ఉన్నాయి. వీళ్లంతా అప్పట్లో రూంమేట్స్. అలా అందరం కలిసి ఎలాగోలా సినిమా చేసేద్దాం అని డిసైడ్ అయ్యారు. అలా కథ, మాటలు త్రివిక్రమ్, హీరోగా వేణు, మ్యూజిక్ ఆర్పి పట్నాయక్, డైరెక్టర్ గా చంద్ర సిధార్థ అనుకున్నాక పాటలు అన్నీ రెడీ అయ్యాయి. షూటింగ్ మొదలు పెట్టిన మూడు రోజులకు సినిమా కథకు, తీస్తున్న విధానానికి తేడా అనిపించి వేణు ఆపేసారు. సొంత ప్రొడక్షన్ బ్యానర్ లో సినిమా చేస్తుండడం మొదటి సినిమా అవ్వడంతో భయమేసి కథ అనుకున్నది ఒకటి షూటింగ్ లో ఒకటి అనిపించి కొన్నిరోజులు ఆపేసారు.

ఇక మళ్ళీ డైరెక్టర్ గోపాల్ గారితో కొంచెం పరిచయం ఉండటంతో ఆయన ద్వారా విజయ్ భాస్కర్ ను కలిసి మాట్లాడి కథ చెప్పగా మొదట ఆలోచించారు, ఆ తరువాత సన్నిహితులు చేయమంటే చేస్తానని చెప్పారట. ప్రార్థన సినిమా ప్లాప్ తరువాత మంచి కథ కోసం విజయ్ భాస్కర్ ఎదురుచూస్తున్న సమయంలో ఈ కథకు ఓకే చెప్పారట. ఇక అంతా సిద్ధం అయింది అనుకున్నాక ఆర్పి పట్నాయక్ నేను మ్యూజిక్ చేయనని చెప్పాడట. చంద్ర సిద్ధార్థ్ డైరెక్షన్ అయ్యుంటే నేను మ్యూజిక్ చేసే వాడిని లేదంటే నేను చేయను అని చెప్పడంతో వందేమాతరం శ్రీనివాస్ గారిని కలిసి ఆయనతో మ్యూజిక్ చేయించుకున్నారట. అలా స్వయంవరం సినిమా పట్టాలెక్కింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago