Reethu Chowdary : శ్రావణ మాసం వచ్చేసింది, ఇక పండగల సీజన్ వచ్చేసింది. ఇక ప్రతి ఇంట పండగ వాతావరణం ఉంటుంది. దీన్ని మరింత పెంచడానికి బుల్లితెరాలో టీవీ ఛానెల్స్ కూడా బాగా ప్రయత్నిస్తాయి. ప్రతి పండగను ఆ ఛానెల్స్ లో పని చేసే ఆర్టిస్టులతో సెలెబ్రేట్ చేసి మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. ఇక ఆ ఛానెల్ లో పని చేస్తున్న ఆర్టిస్తులతోనే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా పిలిచి సంబరాలు చేస్తారు. ఈ సారి కూడా అన్ని ఛానెల్స్ వినూత్నంగా అలోచించి పండగలను జరుపుతున్నారు. ఇక ఈటీవీ మల్లెమాల ఈవెంట్లు చెయడంలో దిట్ట అనే చెప్పాలి. ప్రతి పండగకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ జోడించి మన ముందుకు వచ్చేస్తారు. ఇక ఈ సారి రాఖీ పౌర్ణిమ ను సెలెబ్రేట్ చేసారు.
ప్రోమో అదుర్స్.. పండిన ఎమోషన్స్…
ఇక జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలలో ఉన్న ఆర్టిస్టులు వారి సోదరులతో కలిసి ‘హలో బ్రదర్’ అంటూ రాఖీ సెలెబ్రేషన్స్ చేసారు. శ్రీముఖి హోస్ట్ గా చేసిన ఈ షోలో అందరూ వారి వారి చెల్లెల్లు, అక్కలతో సోదరులు రాఖీ కట్టించుకుని సంబరంగా ఉంటే జబర్దస్త్ ద్వారా, ఇంటి గుట్టు సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయిన రీతూ చౌదరి కోసం తన సోదరుడు రాకపోవడం తో యాంకర్ శ్రీముఖి రీతూని ఈ విషయం అడుగుతుంది. రీతూ చాలా ఎమోషనల్ అయిపోయి తన అన్న ఇక్కడకు రాడని, నేను ఇలా టీవీలో వర్క్ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక తాను ఎమోషనల్ అయి అందరినీ ఏడ్పించేసింది. ఇక వెంటనే శ్రీముఖి నీకో సర్ ప్రైజ్ ఉంది అని రీతూ చౌదరి వాళ్ళ అన్నయ్యను స్టేజి మీదకి తీసుకువస్తారు. అమ్ము నేనొచ్చాను రా అంటూ వాళ్ళ అన్నయ్య రీతూని సర్ ప్రైజ్ చేస్తాడు. రీతూ బాగా షాక్ అయి తన అన్నయ్యకి తన మీద కోపం పోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక తన అన్నయ్యకు రాఖీ కట్టి హగ్ చేసుకోవడంతో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక ప్రోమో కి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. రీతూని వాళ్ళ అన్నయ్య అర్థం చేసుకున్నాడు, కోపం పోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…
సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…
మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…
తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…