Raghu Karumanchi : తెలంగాణ యాసతో కామెడీ పండించి ఆది, అదుర్స్ వంటి సినిమాలతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ రఘు కారుమంచి, అదుర్స్ రఘుగా బాగా పేరు తెచ్చుకున్నాడు. 150 సినిమాలకు పైగా నటించిన రఘు జబర్దస్త్ లో కూడా టీం లీడర్ గా చాలా స్కిట్లలో చేసారు. ఇక ఆయన ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కారుమంచి వెంకట్రావు గారు మరణించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకట్రావు గారు గురువారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.
ఆర్మీ ఆఫీసర్ గా దేశానికి సేవలు…
జూన్ 10, 1947 న జన్మించిన కారుమంచి వెంకట్రావు గారు ఆర్మీ ఆఫీసర్ గా దేశానికి సేవలందించి రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యాక కొడుకు వద్ద ఉన్న వేంకట్రావు గారు కొడుకు కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన మరణ వార్త రఘు గారి ఇంట్లో విషాదాన్ని నింపింది. రఘు గారికి ఆయన కుటుంబ సభ్యులకు ఇండస్ట్రీ వర్గాలు ఆయన సన్నిహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ లో మరణ వార్తలు వింటూనే ఉన్నాం. హీరోల, హీరోయిన్ల ఇళ్లల్లోను మరణ వార్తలు వింటూనే ఉన్నాం. మీనా భర్త, రాధికా శరత్ కుమార్ మాజీ భర్త, నోయల్ తండ్రి, సీనియర్ హీరో అర్జున్ తల్లి తాజాగా ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి మరణించారు. ఇలా గత 45 రోజులుగా ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళ ఇళ్లల్లో విషాధాలు జరగడం బాధాకరం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…