Movie News

Jr NTR: మేనత్త కుటుంబాన్ని పరామర్శించిన ఎన్టీఆర్ దంపతులు.. వైరల్ అవుతున్న ఫోటోలు?

ఈ క్రమంలోనే ఈమె మరణ వార్త తెలియగానే బాలకృష్ణ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఆమె నివాసం వద్దకు చేరుకొని ఆమె అంత్యక్రియల వరకు అక్కడే ఉండి అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇకపోతే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈమె అంత్యక్రియలలో పాల్గొన్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఇండియాలో లేని కారణంగా ఆమె చివరి చూపుకు నోచుకోలేదు.

ఇక తన భార్య పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లిన ఎన్టీఆర్ తన అత్త మరణ వార్త తెలియగానే ఇండియాకు బయలుదేరారు. అయితే ఈయన ఇండియా చేరుకునే సమయానికి మరి కాస్త ఆలస్యం కావడంతో అప్పటికే అంతక్రియలు పూర్తి అయ్యాయి. ఇండియా తిరిగి వచ్చిన ఎన్టీఆర్ వెంటనే తన భార్య లక్ష్మీ ప్రణతి తన తల్లి శాలిని, అన్న కళ్యాణ్ రామ్ కలిసి ఉమామహేశ్వరి ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కంఠమనేని ఉమామహేశ్వరి మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే పోస్టుమార్టం నిమిత్తం ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించడమే కాకుండా ఆమె రెండు కళ్ళను కూడా దానం చేశారు. ఉమామహేశ్వరి మరణానికి మానసిక ఒత్తిడే అసలు కారణమా మరి ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago