Nattikumar : ఏపీ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ నేతలకు అలానే జనసేన పార్టీ నేతలకు మధ్య మాటల వార్ బాగా జరుగుతుంది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మంత్రి రోజా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తుంటే ఆమెకు కౌంటర్ ఇవ్వడానికి జనసేన పార్టీ జబర్దస్త్ హైపర్ ఆదిని రంగంలోకి దించారు. ఇక రోజా పంచులకు రివర్స్ పంచులు వేస్తూ ఆది జనసేన అభిమానులకు బూస్ట్ అప్ ఇచ్చాడు. అయితే ఆదిని వాడుకుంటోంది మెగా ఫ్యామిలీ అంటూ రోజా మరోసారి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాల మీద నిర్మాత నట్టికుమార్ మాట్లాడారు.
ఒకప్పుడు దేవుడంటూ భజన చేసిన వారే నేడు బండబూతులు తిడుతున్నారు…
నట్టి కుమార్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ విమర్శలు రాజకీయాల వరకే పరిమితమైతే బాగుంటుందంటూ మాట్లాడారు. వ్యక్తిగతంగా విమర్శించడం రాజకీయాల్లో లేనివారిని విమర్శించడం బాగోలేదంటూ చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి అందరూ భయపడాలి, బెదిరించి పనులు చేయించుకుంటారు అన్న విమర్శలను రోజా చేయడం తగదు అంటూ నట్టి అభిప్రాయపడ్డారు. రోజా కూడా చిరంజీవి గారితో నటించారు, నాగబాబుతో కలిసి పనిచేసారు అలా మాట్లాడటం ఎందుకు రాజకీయంగా ఏవైనా మాట్లాడొచ్చు కాని ఇలా వ్యక్తిగతం ఎందుకు అంటూ అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు మెగా ఫ్యామిలీ భజన చేసి వాళ్ళ కాళ్ళు నొక్కిన వాళ్ళు నేడు ఇతర పార్టీకి వెళ్లి బండ బూతులు తిడుతున్నారంటూ మాట్లాడారు. మరికొంతమంది నువ్వే నా దేవుడు అంటూ పవన్ కళ్యణ్ కాళ్ళ దగ్గర ఉండేవారు ఇప్పుడు నీకు పోటీగా నిలబడతా అంటూ మాట్లాడుతున్నారు. మెగా ఫ్యామిలీకి ఎంతో మంది వెన్నుపోటు పొడిచారు. మెగాఫ్యామిలీ ద్వారా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న చాలా మంది నేడు వారికంటే గొప్పవారు అన్నట్లు మాట్లాడుతున్నారు అంటూ నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…