Featured

Natti Kumar : దిల్ రాజు ఏది చెబితే దానికి జిందాబాద్ అనడం కాదు… హీరోల రెమ్యూనరేషన్ కాదు ఇక్కడ సమస్య..: నట్టికుమార్

Natti Kumar : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ సినిమా అంతర్గత సమస్యల పరిష్కారం కోసం, ఆ వివాదాలను పరిష్కరించడానికి షూటింగ్ లను బంద్ చేయాలని నిర్మాతల గిల్డ్ నిర్ణయం తీసుకోవడంతో ఒకసారిగా ఇండస్ట్రీ లో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది. అయితే అసలు నిర్మాతల గిల్డ్ కి ఏం అధికారం ఉంది అంటూ కొంతమంది ప్రొడ్యూసర్స్ వాదిస్తున్నారు. వారి స్వప్రయోజలనాల కోసం సినిమా ఇండస్ట్రీ కి నష్టం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఇష్యూ మీద ఇప్పటికే అశ్వినిదత్, తమ్మారెడ్డి భరద్వాజ వంటి వారు స్పందించిన ఇప్పుడు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ కూడా స్పందించారు. జనరల్ బాడీ ఎలక్షన్ జరగడం, నిర్మాతల మండలి చర్చించి సినిమా షూటింగులను బంద్ చేయాలని నిర్ణయం తీసుకోవడం వంటి విషయాల మీద మాట్లాడారు.

దిల్ రాజు జిందాబాద్ అంటే అందరూ జిందాబాద్ అనడమేనా…

నట్టి కుమార్ మాట్లాడుతూ సినిమా షూటింగులను బంద్ చేయమనడం తప్పు కాదు. మొదట నిర్మాతల గిల్డ్ నిర్ణయం తీసుకుని, మిగిలిన నిర్మాతలు మీ ఇష్టం షూటింగులు ఆపితే ఆపుకోవచ్చు లేదంటే లేదు అని చెప్పి, గిల్డ్ సభ్యులు మా చిత్రాల షూటింగులను ఆపేస్తున్నాం అని నిర్మాతల మీటింగ్ లో చెప్పగా మిగిలిన నిర్మాతలు కూడా అందరం యూనిట్ తో ఉండాలని భావించి సినిమా షూటింగులను బంద్ చేద్దాం అని అనుకున్నాం. కానీ ఉదయాన్నే చూస్తే దిల్ రాజు తో సహా మిగిలిన కొంతమంది సినిమా షూటింగులు జరుగుతున్నాయి. దిల్ రాజు సినిమా తమిళ, తెలుగు భాషలలో తీస్తున్న చిత్రం నిర్మాత, డైరెక్టర్ తెలుగు వాళ్ళే, పనిచేస్తున్న వాళ్ళు తెలుగు వాళ్ళే ఇలా ఒక సినిమా షూటింగ్ జరిగి, ఒక సినిమా షూటింగ్ ఆగిపోవడం వళ్ళ కొంత మంది కార్మికులకు పని దొరుకుతుంది, కొంతమంది నష్టపోతారు. ఇలా చేయడం ఎందుకు. చేస్తే సినిమా షూటింగులు కొన్ని రోజులు బంద్ చేసి సమస్యలను ప్రక్షాళన చేయాలి, లేదా షూటింగులను యధావిధిగా చేస్తూ సమస్యల పరిష్కారానికి చర్చలు జరిపి ప్రక్షాళన చేయాలి అంటూ చెప్పారు.

దిల్ రాజు జిందాబాద్ అంటే జిందాబాద్ అని అనడం కాదు అసలు సమస్యను ఎలా పరిష్కరించాలో అని చర్చించాలి అందరితో కలిసి. హీరోల రెమ్యూనరేషన్లు తగ్గినంత మాత్రాన సమస్య పరిష్కారం అవదు. ఎవరి మార్కెట్ ను బట్టి వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలి. వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు, చార్టెడ్ ఫ్లైట్లలో, ఖరీదైన హోటల్స్ లో బస, ఇక ఒక పెద్ద హీరోకి రోజుకి సుమారుగా కోటి రూపాయల ఖర్చు వస్తుంది దీన్ని తగ్గిస్తే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గితుంది. ఇక తిండి దగ్గర కూడా వృధా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ఇలాంటి సమస్యలను అధిగమిస్తే నిర్మాత నష్టాల నుండి గట్టేక్కుతాడు అంటూ చెప్పారు నట్టి కుమార్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago