Movie News

Natti Kumar : బాలకృష్ణ కి, మహేష్ బాబు కి ఉన్న ధైర్యం మిగతావారికి లేదా… చిరంజీవి మాట్లాడలేడా : నట్టి కుమార్

Natti Kumar : సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంఘర్షణ నిర్మాతల సమస్యల కోసం సినిమా షూటింగులను బంద్ చేసారు. అయితే సమస్య సినిమా షూటింగులను బంద్ చేస్తే తీరిపోతాయా అన్నదే ప్రశ్న. నిర్మాతల గిల్డ్ ఏకపక్షంగా తీసుకున్న సినిమా షూటింగ్ ల బంద్ నిర్ణయం మీద అన్నివైపుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే హీరోలు, పెద్ద ఆర్టిస్టులు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే సమస్య తీరుతుంది అని భావిస్తే అది తప్పు అంటూ సినిమా పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఇష్యూ మీద నట్టి కుమార్ మరోసారి స్పందించారు. ఆగష్టు 15 తర్వాత నుండి ఎవరు ఏమి చేసినా మా షూటింగులు మొదలవుతాయి అంటూ బాలకృష్ణ, మహేష్ బాబు ప్రకటించడంతో ఇపుడు ఇండస్ట్రీ లో ఏమి జరుగుతోంది అనే అంశాలపై నట్టి కుమార్ స్పందించారు.

బాలకృష్ణ, మహేష్ కి ఉన్న ధైర్యం మిగతా వాళ్లకు లేదా…

షూటింగుల బంద్ వల్ల నష్టం కార్మికులకు చిన్న సినిమా నిర్మాతలకే కానీ మిగతా వాళ్లమీద పెద్దగా ప్రభావం చూపదు. ఇన్నిరోజులు షూటింగులు బంద్ చేసి గిల్డ్ నిర్మాతలు ఏమి సాధించారు. ఒక్క సమస్యకైనా పరిష్కారం దొరికిందా.. ఎవరి దగ్గరికి వెళ్లి చర్చించారు అంటూ నట్టి కుమార్ ఫైర్ అయ్యాడు. సినిమా ఇండస్ట్రీ లో ఉన్న పెద్దలతో మీ సమస్యలను చర్చించి నిర్ణయం తీసుకుంటే సరిపోయేదానికి షూటింగులను ఎందుకు బంద్ చేయాలి. పెద్ద హీరోలకు షూటింగుల బంద్ వల్ల ఏమీ జరగదు కానీ ఒక చిన్న సినిమాలో పెద్ద ఆర్టిస్ట్ ను పెట్టుకోవాలన్నపుడు షూటింగుల బంద్ వల్ల మళ్ళీ డేట్స్, కాంబినేషన్స్ సెట్ చేసుకోవాలంటే ఒక చిన్న నిర్మాతకు మూడు నెలలు సమయం పడుతుంది. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది.

ఇక రోజూ ఇండస్ట్రీ ని నమ్ముకుని పని చేస్తున్న కార్మికులు నష్టపోతున్నారు అంతే అని కామెంట్స్ చేసారు. ఇక మా షూటింగ్ ఆగష్టు 15 తర్వాత ప్రారంభిస్తున్నాం అంటూ ఇప్పటికే బాలకృష్ణ, మహేష్ బాబు ప్రకటించేసారు. అయితే మిగతా పెద్ద హీరోలు ఎందుకు మౌనంగా ఉన్నారు. చిరంజీవి లాంటి పెద్ద హీరో వద్దకు వెళ్లి సమస్యలకు పరిష్కారం చర్చించి మిగతా హీరోలను ఒప్పించిండవచ్చు కానీ అలాంటి చర్యలేవి తీసుకోలేదు. ఇక ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకునే వాళ్ళు కూడా చొరవ చూపడం లేదు, అందరూ కలిసి కార్మికుల పొట్ట కొడుతున్నారు. వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు ఉంది అంటూ నట్టి అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago