Natti Kumar : తెలుగు సినిమా డైరెక్టర్, మరియు ప్రొడ్యూసర్ అయిన నట్టి కుమార్ తాజాగా జబర్దస్త్ ఇష్యూ మీద మాట్లాడారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డిని దగ్గర నుండి చూసాను, తాను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. మల్లెమాల సంస్థ నుండి భారీ బడ్జెట్ చిత్రాలను తీశారు. శ్యామ్ మాజీ సీఎం విజయ భాస్కర్ రెడ్డి అల్లుడు, అలాగే ఎమ్ఎస్ రెడ్డి గారి కొడుకు అయినా కూడా ఆయనలో గర్వం ఉండదు.
జబర్దస్త్ లో ఉన్నప్పుడే ఆ ఆరోపణలు చేసుంటే దానికి విలువ ఉండేది…
జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన సంవత్సరం తరువాత జబర్దస్త్ లో తిండి బాగోలేదు, అక్కడ మనుషులను గౌరవించరు అంటే ఇలా ఎవరు నమ్ముతారు. పైగా ఇలాంటి విషయాలను సంస్థలోనే చర్చించుకోవాలి కానీ ఇలా బయటకు వచ్చి చెబితే ఏం లాభం అంటూ నట్టి కుమార్ అభిప్రాయ పడ్డారు. ఎన్నో ఏళ్ల నుండి ఉన్న సంస్థ, అదీ కాక కాంట్రవర్సీకి దూరంగా ఉండే శ్యామ్ ప్రసాద్ గురించి ఇలాంటి వాఖ్యలు కరెక్ట్ కాదు. శ్యామ్ ప్రసాద్ ను దగ్గరగా చూసిన వారెవరూ కిర్రాక్ ఆర్పి వాఖ్యలను నమ్మరు అంటూ చెప్పాడు.
ఇక నాగబాబు గారు సహాయం చేస్తారు శ్యామ్ ప్రసాద్ పట్టించుకోరు అని ఆరోపణలకు నట్టి సమాధానం ఇచ్చారు. నువ్వు చేస్తున్న పనికి నీకు జీతం వచ్చిందా, కరెక్ట్ గా వస్తోందా లేదా అన్నదే పాయింట్. నాగబాబు కి డబ్బులెక్కువ ఉండి అవి ఊరికే ఇస్తే అదే పని శ్యామ్ ప్రసాద్ ఎందుకు చేయాలి. నీకు జీతం సరిగా ఇవ్వకపోయుంటే నువ్వు ఆరోపించాలి కానీ మిగతా విషయాలు ఎందుకు అంటూ నట్టి కుమార్ అభిప్రాయ పడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…