Sunitha : సునీత 15 ఏళ్ళ వయసుకే ‘గులాబీ’ సినిమాలోని ‘ఈవేళలో నీవు’ అనే పాటతో కెరీర్ ను ప్రారంభించి మొదటి పాట తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళం లలో దాదాపు ఇప్పటివరకు 3000 పాటలు పాడింది. సింగర్ గానే కాకుండా అనేక సినిమాలలో హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పడం జరిగింది. అయితే సునీత సింగర్ గా ఎంత బిజీ గా వున్నా సోషల్ మీడియా లో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో సునీతకు 3.5 మిలియన్ ఫాలోయర్స్ వున్నారు. ఇక సునీత ఎప్పటికప్పుడు ఫోటోలు, రీల్స్ అంటూ అభిమానులకు చేరువగా వుంటారు. తాజాగా తన భర్త రామ్ వీరపనేని తో వున్న ఒక వీడియోని అభిమానులతో పంచుకుంది.
ముస్కురానే కి వజహ్ తుమ్ హో అంటూ…
సునీత మ్యాంగో అధినేత రామ్ వీరపనేనిని 2021 జనవరి 9న పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్ళి చేసుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. అయితే తాజాగా సునీత తన భర్తను కౌగలించుకుని, చిరునవ్వులు చిందిస్తూ తీసుకున్న ఫోటోకి ఒక మ్యూజిక్ ట్రాక్ ను యాడ్ చేసి ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
సిటీలైట్స్ అనే బాలీవుడ్ సినిమాలోని “ముస్కురానే కి వజహ్ తుమ్ హో” అనే పాటను ఆ ఫొటోకు జత చేశారు. ఈ పాటకు అర్ధం “నా మొఖంలో చిరునవ్వుకు కారణం నీవే” అని. అంటే సునీత తన సంతోషానికి కారణం ఆమె భర్త అని ఈ వీడియో ద్వారా తెలియజేసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లి తెగ వైరల్ అవుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…