Featured

Nayan – Vignesh Marriage : నయనతార డబ్బు కోసం తన పెళ్లి రైట్స్ ని కూడా అమ్ముకుంది… ఘాటు వ్యాఖ్యలు చేసిన దర్శకుడు….

Nayan – Vignesh Marriage : లేడీ సూపర్ స్టార్ నయన్, తమిళ దర్శకుడు విగ్నేష్ ల వివాహం జూన్ 9 న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతూ బంధు మిత్రుల సమక్షంలో పెళ్లితో ఒక్కటైయ్యారు. నయన్ విగ్నేష్ ల జంటను బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ నుంచి సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ వరకు ప్రముఖులంతా హాజరు అయ్యి ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం సాంప్రదాయంగా తిరుమల దర్శనం కూడా చేసుకున్నారు. ఆ తరువాత కూడా మొక్కులను చెల్లించుకోవడానికి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. అయితే ఎంతో ఘనంగా జరిగిన తమ పెళ్లివేడుకకు సంబందించిన హక్కులను నయన్ – విగ్నేష్ రూ. 25 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కు అమ్మినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయం పై దర్శకుడు వేలు ప్రభాకరన్‌ ఆసక్తికర వాఖ్యలు చేశారు.

హీరో ఎంజీఆర్ ని ఆదర్శంగా తీసుకోవాలి…..

ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు వేలు ప్రభాకరన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ చిన్న చిన్న నటులు కూడా ఈ కాలంలో విలావాసంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వారి వ్యక్తిగత పర్యటనలకు, విదేశాలకు వెకేషన్స్‌కి వెళ్లడానికి ఎవరికి వారు ప్రత్యేక హెలికాప్టర్లను వాడుతున్నారు. ఇటీవల జరిగిన నయన్ పెళ్లి గురించి మాట్లాడుతూ… నయన్ విగ్నేష్ వారి వివాహాన్ని 50 కోట్లకు అమ్మకున్నారు. తన పెళ్లి విషయంలో ఆమెకు ఆ హక్కు ఉంది. కానీ దాన్ని కొనుకున్నవాడు.. ఆ పెళ్లిని ప్రసారం చేసి ప్రేక్షకులు వద్ద నుంచి రూ.500 కోట్లు సంపాదిస్తాడు. ఆ తర్వాత ఇదే పద్దతి ప్రతి సెలబ్రిటీకి సంప్రదాయంగా మారుతుంది. తమ విలసాలను ప్రజలకు చూపించుకోవడానికి బాగా ఖర్చు పెట్టి వివాహాలు చేసుకొని అధిక మొత్తానికి అమ్ముకుంటారు.

ఇలాంటి వారందరూ ఆనాటి హీరో ఎంజీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి అని ఆయన వ్యాఖ్యనించారు. “ఆయన ఎంత సాదా జీవితం గడిపేవారో ఈకాలం నటులు తెలుసుకోవాలి’’ అని చెప్పారు. ఆనాటి హీరో ఎంజీఆర్‌ తన బంధువులు, కుటుంబ సభ్యుల వివాహాలు ఘనంగా జరపడానికి అసలు ఇష్టపడేవారు కాదు. తాను సంపాదించిన ప్రతి రూపాయి పేద ప్రజల నుంచి వచ్చిందే అని ఆయన భావించేవారు, అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago