Nayanatara : దక్షిణాది సినిమా ఇండస్ట్రీలలో నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక గ్లామర్ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరో తో సమానమైన క్రేజ్ తో ఇప్పటికి కోట్లమంది అభిమానులను సంపాదించుకుని అప్ కమింగ్ హీరోయిన్లకు రోల్ మోడల్ గా నిలుస్తోంది. హీరోయిన్ అంటే మూడు పదుల వయసు రాగానే ఇక పెళ్లి చేసుకుని సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినా తల్లి పాత్రలు, అక్క పాత్రలోతో సరిపెట్టుకుంటారు. కానీ నయనతార కెరీర్ అందుకు భిన్నంగా ఒక హీరోకి ఉన్న ఇమేజ్ కి సమానమైన ఇమేజ్ తో సినిమా ఇండస్ట్రీ ని ఏలుతోంది.
కోట్ల ఆస్తులు… కోట్లల్లో పారితోషకం….
నయనతార బెంగళూరులో జన్మించిన మళయాళి కుట్టి. తన సినిమా ప్రయాణం తమిళ సినిమాతో మొదలైంది. తెలుగులో వెంకటేష్ తో నటించిన లక్ష్మి సినిమాతో 2006 లో ప్రారంభించింది. ఇక ఆతరువాత టాప్ హీరోస్ అందరితోనూ నటించిన నయనతార ప్రేమ వ్యవహారాలతో వ్యక్తిగతంగా దెబ్బతినింది. రెండు సార్లు ప్రేమ విషయంలో దెబ్బతిన్న నయన్ ఇక ఆతరువాత తన కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టి జీరో సైజు తో కనువిందు చేసింది. మొదట్లో గ్లామర్ రోల్స్ చేసిన నయన్ ఆ తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు మొగ్గింది. ఇక యాక్షన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన అభిమానుల సంఖ్యను పెంచుకుంది.
తమిళ లేడీ సూపర్ స్టార్ గా నిలిచింది. మూడు పదుల వయసులో ఉన్న నయనతార క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు తాను నటించిన సినిమాలు హిట్ అవ్వక పోయినా తన పాత్రకు మాత్రం పేరోచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక నయన్ ఒక్కో సినిమాకు 5 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది. అలా ఏడాదికి 15 కోట్లవరకు ఆదాయం ఉంది. అంటే నెలకు కోటి రూపాయలు సంపాదిస్తోంది. ఇక నయన్ ఆస్తుల విలువ దాదాపు 100 కోట్లు. ఇపుడు పెళ్లి చేసుకున్న విగ్నేష్ కు చెన్నై లో తాను ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇంటిని పెళ్లి బహుమతి గా ఇచ్చిందని సమాచారం దాన్ని విలువ సుమారు 20 కోట్లు ఉండొచ్చని అంచనా.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…