Pooja Hegde : తెలుగు లో ఒక లైలా కోసం సినిమా ద్వారా 2014 లో పరిచయమైన బుట్ట బొమ్మ పూజ హెగ్డే. ఆ తరువాత ముకుందా సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. అల్లు అర్జున్ తో డీజే, అలా వైకుంఠపురంలో సినిమాల్లోను, ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవలోనూ ఇక తెలుగే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా టాప్ హీరోస్ తో జోడి కడుతూ బిజీ గా ఉంది ఈ భామ.
ఇండిగో విమానంలో అవమానించిన స్టాఫ్….
తాజాగా పూజ హెగ్డే ప్రభాస్ తో కలిసి రాధే శ్యామ్, విజయ్ తో కలిసి బీస్ట్ సినిమాల్లో నటించింది. కానీ ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కానీ అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. F3 సినిమాలో మరోసారి ఐటమ్ సాంగ్ లో మెరిసింది. ఇక తాజాగా పూజ హెగ్డే ఇండిగో విమానంలో ప్రయాణించినపుడు తనకు ఎదురైన చేదు అనుభావాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
సాధారణంగా శాంత స్వభావం గళ పూజ ఎప్పుడూ ఇలా ఒకరిపై ఫిర్యాదు చేయడం జరగలేదు. కానీ ఇండిగో ఎయిర్‌లైన్స్ స్టాఫ్ విపుల్ నాకాషి వల్ల తాను భయబ్రాంతులకు లోనైనట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ముంబై వస్తున్న సమయంలో విపుల్ బెదిరించినట్లు మాట్లాడరని ఏ కారణం లేకపోయినా తమతో రూడ్ గా ప్రవర్తించాడని, సాధారణంగా ఇలాంటి విషయాలు పట్టించుకోనని కానీ ఈ సంఘటన చాలా భయాన్ని కలిగించిందని ట్వీట్ చేసారు పూజ. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…