Featured

Bramhanandam : బ్రహ్మీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారంటే..!

Bramhanandam : తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది టాప్ హీరోలు ఉండొచ్చు, ఒక్కో హీరోకి కోట్లలో అభిమానులు ఉండొచ్చు కానీ అదే హీరోకి యాంటీ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు. కానీ యాంటీ ఫ్యాన్స్ అంటూ లేనేలేని వ్యక్తి ఇండస్ట్రీలో బ్రహ్మనందం. మన తెలుగు ప్రేక్షకులైతే చిన్న పెద్ద తేడా లేకుండా బ్రహ్మీ అని పిలుచుకుంటారు. 1956 ఫిబ్రవరి 1 న జన్మించిన కన్నెగంటి బ్రహ్మానందం గారు మొదట లెక్చరర్ గా తొమ్మిదేళ్లు పనిచేసారు. ఆ తరువాత తాతావతారం సినిమాలో నటించారు. ఆ తరువాత జంధ్యాల గారి అహ నా పెళ్ళంట సినిమాలో అరగుండు పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఆ తరువాత బ్రహ్మానందం లేని తెలుగు సినిమా ఉండదా అనేంతగా ఆయన పాపులర్ అయ్యారు.

కోట్ల విలువ చేసే ఆస్తులు….

ఇక బ్రహ్మానందం గారు ఒక దశలో బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. ఆయన లేని సినిమా లేదు అనేంతగా నటించారు. ఒక్కో కాల్షీట్ కి లక్షరూపాయల పారితోషకం తీసుకునేవారు బ్రహ్మీ. అలా ఒక్కో సినిమాకు దాదాపు కోటి దాక రెమ్యూనరేషన్ ఉండేది. హీరోల తరువాత అత్యధిక పారితోషకం తీసుకునే వ్యక్తి బ్రహ్మీనే. ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటించడం తగ్గించారు బ్రహ్మానందం గారు. కానీ మీమ్స్ రూపంలో వాట్సాప్ స్టిక్కర్స్ రూపంలో ఆయన మనకు చేరువవుతూనే ఉన్నారు. ఇక ఆయన సంపాదించిన డబ్బులన్నీ భూములపైనే పెట్టుబడి పెట్టారు.

అలా సుమారుగా 500 కోట్ల రూపాయల ఆస్తులను ఆయన కూడబెట్టారని వినికిడి. ఇక ఆయన కుమారుడు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా హీరోగా సక్సెస్ కాలేదు. ఇక బ్రహ్మీ గారికి ఉన్న మరో టాలెంట్ ఈ లాక్ డౌన్ టైం లో అందరికి తెలిసింది. అదే ఆయన మంచి చిత్రకారుడు. అలా లాక్ డౌన్ సమయంలో ఆయన గీసిన చిత్రాలను పలువురు హీరోలకు కానుకగా పంపారు. ఆయా హీరోలు ఆ చిత్రాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం వల్ల ఈ విషయం బయటికి వచ్చింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago