Nayanatara : అట్టహాసంగా నయన్, విగ్నేష్ ల పెళ్లి జరిగింది. మహాబలిపురంలో గురువారం మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది ప్రేమ జంట. ఇక పెళ్ళికి సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్, కార్తి, అజిత్, డైరెక్టర్ అట్లీ, విజయ్ సేతుపతి, దర్శకుడు మణిరత్నం తమిళ ఇండస్ట్రీ నుండి హాజరయ్యారు. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా పెళ్ళికి హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు.
పెళ్లి చీర, నగల ఖరీదు ఎంతంటే…..
ఇక పెళ్ళికి సంబంధించిన ఫోటోల చిత్రీకరణకు మీడియాకు అనుమతి ఇవ్వలేదు. గౌతమ్ మీనన్ పర్యవేక్షణలో పెళ్లి జరిగింది. ఇక పెళ్లికి సంబంధించిన వీడియోను నెట్ ఫ్లిక్స్ ఇండియా ప్రసారం చేసే హక్కులను భారీ మొత్తానికి తీసుకుంది. పెళ్లి తరువాత విగ్నేష్ శివన్, నయనతారలు వారి పెళ్ళికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
ఇక ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యాక చర్చంతా నయన్ పెళ్లి చీర, నగల గురించే. నయన్ ఎరుపు రంగు డిజైనర్ చీరను మోనికా, కరిష్మ అనే డిజైనర్స్ చేత చేయించుకుంది. పట్టు చీర కట్టకుండా డిజైనర్ చీర కట్టుకోవడం కూడా మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే విగ్నేష్ శివన్ కుటుంబ సంప్రదాయం ప్రకారం ఎరుపు రంగు చీర కట్టుకోవాలట. అందువల్ల నయన్ ఎరుపురంగు డిజైనర్ చీరను ఎంచుకుంది. అయితే నయన్ ఎరుపురంగు చీరలో పచ్చలు, వజ్రల్తో కూడిన నాగలతో అచ్చం కుందనలు బొమ్మలాగే ఉందని అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇక నగల విషయానికి వస్తే పచ్చలు, డైమండ్స్ తో కూడిన చోకర్ అలాగే సత్లడం ను ధరించింది నయన్. ఇక వీటి విలువ సుమారు 2.5 కోట్ల నుండి 3 కోట్లు ఉండొచ్చని అంచనా. ఇక నయన్ ధరించిన ఎంగేజ్మెంట్ రింగ్ దాదాపు 5 కోట్లు. ఇవన్నీ నయన్ కు విగ్నేష్ తరపు నుండి కానుకలుగా చెప్తున్నారు.
ఇక నయన్ కూడా తన భర్తకు కాస్ట్లీ బహుమతి ఇచ్చింది. తాను ఎంతో ఇష్టంగా కట్టించుకున్న చెన్నై లోని తన ఇంటిని విగ్నేష్ కి గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ ఇంటి విలువ సుమారు 20 కోట్లు ఉండొచ్చని అంచనా. ఇక పెళ్లి విషయానికి వస్తే 20 మంది పురోహితులతో పెళ్లితంతు చేసారు. వడపళని, తిరుత్తణి, మైలాపూర్, కాళికాంబాల్ నుంచి పురోహితులు తరలివచ్చారు. ఇక ఈ నూతన వధూవరులకు అభిమానులతో సహా సినిమా ప్రముఖులు కూడా పెళ్లి శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక త్వరలోనే ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ పార్టీ ఇస్తారని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…