Nayanatara: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి నయనతార ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా గడుపుతున్నారు.నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఈమె ఒక భార్యగా తల్లిగా కూడా ప్రమోట్ అయ్యి తన వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారని చెప్పాలి.
ఈమె హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ప్రభుదేవాతో పాటు నటుడు శింబుతో ప్రేమ ప్రయాణం నడిపించారు. అనంతరం వీరి ప్రేమ బ్రేకప్ కావడంతో దర్శకుడు విగ్నేష్ శివన్ తోప్రేమలో పడటం అనంతరం కొంతకాలం పాటు రిలేషన్ లో ఉన్నటువంటి వీరిద్దరూ ఎట్టకేలకు గత ఏడాది జూన్ 9వ తేదీ వివాహం చేసుకున్నారు.
ఇలా వివాహం చేసుకున్నటువంటి ఈ దంపతులు పెళ్లి జరిగినటువంటి నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు.ఇలా సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావడంతో ఈ విషయం అప్పట్లో పెద్ద ఎత్తున వివాదంగా మారింది. అయితే అందుకు సంబంధించిన అన్ని వివరాలను నయనతార దంపతులు ప్రభుత్వానికి సమర్పించడంతో ఈ వివాదం ముగిసిందని చెప్పాలి.
ఈ విధంగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినటువంటి నయనతార ప్రస్తుతం ఆ పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన పిల్లల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ పిల్లలను నా గర్భంలో పెంచకపోయిన తాను అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. వారు నా జీవితంలోకి వచ్చిన తర్వాత జీవితమే మారిపోయిందని వారితోనే రోజు మొదలై వారితోనే నా రోజు ముగుస్తుంది అంటూ ఈ సందర్భంగా నయనతార ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…