Categories: FeaturedMovie News

Kajal Aggarwal: మరోసారి తల్లి కాబోతున్న కాజల్.. ఇక సినిమాలకు దూరమైనట్టేనా?

Kajal Aggarwal: వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా వెండితెర నటిగా అన్ని భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ 2020వ సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

వివాహం తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న కాజల్ అగర్వాల్ నీల్ కిచ్లుఅనే అబ్బాయికి జన్మనిచ్చారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ తో ఈ బాబుకి ఏడాది కూడా పూర్తి అయింది. ఇక బాబు పుట్టిన తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి కాజల్ అగర్వాల్ తిరిగి సినిమాలలోకి వచ్చారు.

ఈ క్రమంలోనే ఈమె కమిట్ అయినటువంటి ఇండియన్ 2సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్నటువంటి భగవంత్ కేసరి సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ నటించే అవకాశాన్ని అందుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత కాజల్ తిరిగి సినిమాలలో కనిపించదన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kajal Aggarwal:మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న కాజల్..


కాజల్ అగర్వాల్ మరోసారి తల్లి కాబోతున్నారని అందుకే ఈమె సినిమాలకు దూరం కాబోతున్నారని తెలుస్తుంది. తన భర్త కోరిక మేరకు ఇంకొక బిడ్డకు జన్మనివ్వడానికి కాజల్ సిద్ధమయ్యారట.ఈ క్రమంలోనే ఈమె మరోసారి గర్భం దాల్చిందని అందుకే సినిమాలకు దూరం కాబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇలా కాజల్ రెండోసారి తల్లి కాబోతున్నారన్న వార్త అభిమానులకు నిజంగానే గుడ్ న్యూస్ అయినప్పటికీ ఈమె సినిమాలకు దూరమవుతారని తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కాజల్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago