Tamannaah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈమె కేవలం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈమె నటుడు విజయ్ వర్మతో కలిసి నటించిన లస్ట్ స్టోరీ 2 విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తమన్నకు పెళ్లి గురించి ఒక ప్రశ్న ఎదురయింది. పెళ్లి విషయంలో ఒత్తిడికి గురవుతున్నారా అన్న ప్రశ్న ఈమెకు ఎదురయింది. ఈ ప్రశ్నకు తమన్నా సమాధానం చెబుతూ పలు విషయాలను వెల్లడించారు. పెళ్లి అనేది మనకు నచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు చేసుకునేది కాదని తెలియజేశారు.
పెళ్లి అంటే ఒక బాధ్యత ఆ బాధ్యతను మనం మోయగలము అన్న నమ్మకం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలని ఈమె సూచించారు. పెళ్లి అంటే ఒక పార్టీ కాదు.ఇద్దరు కలిసి ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండాల్సి ఉంటుంది కనుక పెళ్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలో గత దశాబ్దన్నర కాలంగా నటిగా కొనసాగుతున్నటువంటి తమన్నా ఇప్పటివరకు పెళ్లి ఊసే ఎత్తడం లేదు అయితే ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నానంటూ తన రిలేషన్ గురించి చెబుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే తమన్న ఇలా చెప్పడంతో త్వరలోనే ఈమె కూడా ఈ కొత్త బంధంలోకి అడుగుపెట్టబోతుందంటూ వార్తలు వినపడుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…