Featured

Tejaswini Reddy : లండన్ లో తెలుగమ్మాయి హత్య… ఇండియా వస్తుందని అనుకుంటే తిరిగిరాని లోకాలకు…!

Tejaswini Reddy : తెలంగాణ రాష్ట్రానికి చెందిన 27 ఏళ్ల తేజస్విని రెడ్డి లండన్ లో ఎంఎస్ చేయడానికి రెండేళ్ల క్రితం వెళ్ళింది. అయితే తాజాగా ఆమె చదువు అయిపోయి తిరిగి ఇండియా రావాల్సి ఉండగా ఇంతలోనే ఒక కిరాతకుడు ఆమెను హత్య చేసాడు. స్థానిక వెంబ్లే ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌కే చెందిన బ్రెజిల్ కి చెందిన వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు చెబుతున్నారు. లండన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. విషయం తెలిసి తేజస్విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. త్వరలో తేజస్వినికి పెళ్లి చేయాలని అనుకుంటుండగా ఇలా జరిగిందని బాధపడ్డారు.

మరో అమ్మాయి మీద దాడి…

లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చదువుతున్న తేజస్విని రెండు నెలల క్రితమే ఇండియా రావాల్సి ఉండగా ఆగష్టులో వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని బ్రాహ్మణపల్లివాసి. తేజస్వని అన్న కూడా ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. తండ్రి ఎలక్ట్రీషియన్ కాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చదువుయ్యాక కూతురికి పెళ్లి చేయాలని అనుకున్నారు. లండన్ లోని స్థానిక మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీల్డ్ క్రెసెంట్‌లో జరిగిన ఈ ఘటనలో తేజస్విని కత్తిపోట్లకు గురై అక్కడికిక్కడే మృతి చెందగా 28 సంవత్సరాల అఖిల అనే మరో మహిళ తీవ్రంగా గాయపడింది.

ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అఖిలకు ప్రాణాపాయం లేదని తెలిసింది. జరిగిన దారుణం గురించి తేజస్విని సమీప బంధువు విజయ కుటుంబ సభ్యులకు తెలియచేశారు. తేజస్విని తన స్నేహితులతో కలిసి ఉండే అపార్ట్‌మెంట్‌లోకి బ్రెజిల్‌కు చెందిన ఆగంతకుడు వారం రోజుల క్రితం కూడా వెళ్లాడని పోలీసులు నిర్థారించారు. హత్య చేసిన వ్యక్తి పేరు కెవెన్ ఆంటోనియో లౌరెన్సోడి మోరియస్ అని పేర్కొంటూ ఫోటో కూడా విడుదల చేశారు. ఇక తేజస్విని మృత దేహం ఇండియా రావడానికి త్వరిత చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago